Begin typing your search above and press return to search.
ఇన్ చార్జితో వేగలేక రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే?
By: Tupaki Desk | 27 Aug 2019 2:30 PM GMTరాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తానంటూ వాపోతూ ఉన్నారట. తన నియోజకవర్గంలో ఇన్ చార్జిగా ఉన్న వ్యక్తి పోరు తట్టుకోలేక ఆయన రాజీనామా ఆలోచన వరకూ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే తనే అయినప్పటికీ వేరొక నేత తన నియోజకవర్గంలో అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నాడని - తన మాట ఎక్కడా జరగకకుండా పోతోందని ఆయన వాపోతున్నారట.
ఇప్పటికే వీరి రచ్చ మీడియా వరకూ ఎక్కింది. ఈ విషయం లో ముఖ్యమంత్రి జోక్యం ఒక్కటే మిగిలింది. వీళ్లిద్దరూ ఇప్పుడు పరస్పర హెచ్చరికల వరకూ వచ్చారు. ఎమ్మెల్యేనేమో తను పదవికి రాజీనామా చేసి తప్పుకుంటానంటూ ప్రకటనలు చేస్తున్నారట. ఇక ఆ ఇన్ చార్జేమో తన మాట జరగకపోతే తను పార్టీకే రాజీనామా చేస్తానంటూ లీకులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అయితే అలాంటి లీకులు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. మళ్లీ అతడే రంగంలోకి దిగి తను కడదాకా జగన్ వెంటే నిలవబోతున్నట్టుగా ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఇలా ఒకరు పదవికి రాజీనామా అని- మరొకరు పార్టీకి రాజీనామా అంటూ రచ్చలు రేపుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మరి వారిద్దరి మధ్యన వివాదం ఎప్పటికి పరిష్కారం అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయంలో అధినేత జోక్యం చేసుకుంటే కానీ వారిద్దరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఉండవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.