Begin typing your search above and press return to search.

ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు?

By:  Tupaki Desk   |   21 Sep 2019 7:20 AM GMT
ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు?
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నూటా యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో.. సొంత నియోజకవర్గాలకు ఎంత మంది అందుబాటులో ఉన్నారనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల వైపు చూడటం లేదని టాక్. నియోజకవర్గాలకు - నియోజకవర్గ కేంద్రాలకు వెళితే.. అక్కడ కార్యకర్తలు - నేతలు.. తమకు అది కావాలి - ఇది చేయాలి.. అంటూ అడుగుతున్నారని - అందుకే వీళ్లు నియోజకవర్గాలకు వెళ్లడమే మానేశారని వార్తలు వస్తున్నాయి.

అధికారంలో లేనంత సేపూ వీరు నియోజకవర్గాల్లోనే తిష్ట వేశారు. అక్కడ కార్యకర్తలను కలుకుపోయారు. వాళ్లకు బోలెడన్ని హామీలు ఇచ్చారు. పని చేయించుకున్నారు. అలాంటి వాళ్లు ఇప్పుడు సహజంగానే కొన్నింటిని అడుగుతారు. వారి గొంతెమ్మ కోరికలను తీర్చలేకపోయినా.. న్యాయబద్ధమైనవి - చట్టబద్ధమైన పనులు చేసి పెట్టడం తప్పేం కాదు.

అయినప్పటికీ నేతలు కొందరు మొరాయిస్తున్నారని సమాచారం. అలా మొరాయిస్తూ వారు నియోజకవర్గాల వైపు వెళ్లడమే మానేశారని తెలుస్తోంది.

హైదరాబాద్ లో కొందరు - బెంగళూరులో మరి కొందరు కుటుంబాలతో గడుపుతూ ఉన్నారని.. నియోకవర్గానికి వెళ్లడానికి మాత్రం వారు ముందుకు రావడం లేదని సమాచారం. కార్యకర్తలను - నమ్ముకున్న వారిని తప్పించుకోవడానికి - తమ పనులను మాత్రమే చక్కబెట్టుకోవడానికి వీళ్లంతా.. కేరాఫ్ సిటీలు అన్నట్టుగా ఉన్నారని సమాచారం. గెలిచిన వారిలో దాదాపు ఎనభై మంది వరకూ ఇలానే వ్యవహరిస్తున్నారని - మిగిలిన వారు మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చాకా కూడా కలుపుగోలుగా..నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటున్నారని సమాచారం.