Begin typing your search above and press return to search.
వైఎస్, జగన్ ఫొటోలు లేకుండా వైసీపీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్!
By: Tupaki Desk | 31 Jan 2020 4:19 AM GMTఇప్పటికే నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ప్రత్యేకించి నియోజకవర్గంలో ఒక ప్రధాన సామాజికవర్గాన్ని బాగా వ్యతిరేకిస్తూ ఆయన వారిని ఇబ్బంది కూడా పెడుతున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. పార్టీకి అండగా ఉండే వారిని ఆయన వేధిస్తూ.. వారిని పూర్తి అప్రాధాన్య స్థితికి తీసుకెళ్లారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి తక్కువ కాలంలోనే ఆయన స్థానికంగా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారనే విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి.
ఆ సంగతలా ఉంటే..ఇప్పుడు అన్నా రాంబాబు మరో అడుగు ముందుకు వేసినట్టుగా ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో కానీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఫొటో కానీ లేకుండానే.. అన్నా రాంబాబు ఫ్లెక్సీలు, ప్రోగ్రామ్ లు సాగిపోతూ ఉన్నాయని సమాచారం. ఫ్లెక్సీలు వేయించినా.. అందులో వైఎస్, జగన్ ఇమేజ్ లకు తావు లేకుండా పోతోందట. ఈ నేపథ్యంలో పార్టీ ఊసే లేకుండా.. అంతా తన హవానే అన్నట్టుగా అన్నా రాంబాబు వ్యవహరిస్తూ ఉన్నారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.
సాక్షాత్ దివంగత సీఎం వైఎస్ఆర్, ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ ల ఫొటోలనే పూర్తిగా పక్కన పెట్టేయడాన్ని నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ ఆక్షేపిస్తూ ఉంది. ఈ క్రమంలో మరో ప్రోగ్రామ్ కూడా అదే రీతిన సాగింది.
గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా వైఎస్ ప్రస్తావన కానీ వైఎస్ జగన్ ఫొటో కానీ లేదు. అలా పార్టీ మూలాలను మరిచినట్టుగా అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రామ్ సాగింది. ఇప్పటికే మూటగట్టుకున్న వ్యతిరేకతకు తోడు..ఇలాంటి చర్యలతో పార్టీ కార్యకర్తలనే అన్నా రాంబాబు తీవ్రంగా అసహనానికి గురి చేస్తూ ఉన్నాడనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.