Begin typing your search above and press return to search.
ఏ పార్టీ అయినా ఓకే...వైసీపీ ఎమ్మెల్యేల నిర్వేదం..?
By: Tupaki Desk | 8 Aug 2022 1:30 PM GMTరాజకీయ నాయకులకు ఉండాల్సింది ఉత్సాహం. తమ భవిష్యత్తు మీద నమ్మకం. రేపటి రోజు మీద అచంచల విశ్వాసం. కానీ అధికార వైసీపీలోని ఎమ్మెల్యే విషయంలో మాత్రం అలా ఏ ఒక్కటీ కూడా కనిపించడంలేదు. వారిలో ఏదో తెలియని నిరాశ, నిర్లిప్తత, చివరికి అన్నీ కలసి నిర్వేదంగా మారిపోయాయి. వారిని ఎవరు కదిపి కుదిపి చూసినా ఏముంది మాకు ఏ పార్టీ అయితే ఏముంది మరి అనే అనుకుంటున్నారుట. ఉన్న పార్టీ విపక్షంలోఅయితే ఏమీ లేదు. దర్జాగా అధికారం వెలగబెడుతోంది.
మరి అలాంటి పార్టీలో ఉండి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగానే వైసీపీ ఎమ్మెల్యేలకు ఎందుకీ వేదాంతం, ఎందుకొచ్చిన వైరాగ్యం అంటే జవాబు సులువే. వారికి సొంత పార్టీలో సెగ బాగా తగులుతోంది. అక్కడ పొగ పెట్టేస్తున్నారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తట్టుకోలేని పరిస్థితి కూడా పెద్దలే కల్పిస్తున్నారు అని వాపోతున్నారు.
వారు మూడేళ్ళ క్రితం బాగా కనిపించారు వారే కావాలనుకున్నారు. టికెట్లు ఇచ్చారు. గెలిపించుకున్నారు. బలం పెంచుకున్నారు. బంపర్ మెజారిటీ సాధించారు. ఇపుడు ఆ ఎమ్మెల్యేలే బరువు అవుతున్నారుట. వారి పనితీరు బాలేదని సర్వేలు వదిలి మరీ వారిని మానసిక వేదనకు గురి చేస్తున్నారు అని అంటున్నారు. అసలు పనితీరు అంటే ఏమిటి అన్న పెద్ద ప్రశ్న కూడా వైసీపీ ఎమ్మెల్యెల నుంచి వస్తోంది. పనులు ఏమి చేయాలి. జనాలకు ఏమైనా చేసేందుకు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో ఉన్న పవర్ ఏమిటి అని కూడా అంటున్నారు.
కనీసం ఒక పించన్ కూడా ఇచ్చే అధికారం కానీ దర్జా కానీ ఎమ్మెల్యేలకు లేదు కదా అని వాపోతున్నారు. వాలంటీర్ తమ కంటే బలంగా ఉన్నారని, వారికి జనాలు చెప్పుకుంటూ తమ పనులు చేసుకుంటున్నపుడు మరి ఎమ్మెల్యేలు ఎందుకు అవసరం అవుతారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అలా ఉత్సవ విగ్రహాల ఎమ్మెల్యేలు మారినా కూడా అధికార పార్టీ వారికి పని పెడుతోంది. అదేంటి అంటే వీలు దొరికినప్పుడల్లా అధినాయకత్వాన్ని పొగడడం. అదే టైమ్ లో అనవసరంగా విపక్షాన్ని దారుణంగా విమర్శించడం.
ఈ రెండు సుబ్బరంగా చేస్తే కనుక వారు అద్భుతమైన పనితీరుని కంబరుస్తున్నట్లుగా లెక్కట. ఆ విధంగా పనితీరు బాగుందని అన్న వారికే సర్వేలు కూడా జేజేలు కొడతాయట. అదన్న మాట సర్వేల అసలు రహస్యం అని తెలుసుకున్న ఎమ్మెల్యేలు మాత్రం మాకెందుకు వచ్చిన ఈ రొష్టు అని మిన్నకుండిపోతున్నారు. సొంత పార్టీ వారిని పొగిడినా ఓకే కానీ లేని పోని విమర్శలు చేసి విపక్షం మీద నోరు పారేసుకుంటే మాత్రం రేపటి రోజున తామున్న పార్టీ నీ అవసరం లేదు బయటకు వెళ్ళు అంటే తమ గతేం కానూ అని ఎమ్మెల్యేలు తెలివిడిగానే ఆలోచన చేస్తున్నారుట.
అందుకే వైసీపెలో మూడవ వంతు అంటే ఒక యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేల దాకా అసలు నోరు మెదపడంలేదు అంటున్నారు. వీరి మీదనే సరిగ్గా అధినాయకత్వం కూడా గురి పెట్టి మరీ సర్వేల పేరిట భయపెడుతోంది అంటున్నారు. మీ పనితీరు ఏ మాత్రం బాలేదని కూడా ప్రతీ వర్క్ షాప్ లోనూ అధినాయకత్వం ఎండగడుతోందిట. దీంతో ఈ ఎమ్మెల్యేలకు ఒక విషయంలో పక్కా క్లారిటీ వచ్చేసింది అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమకు టికెట్ ఇవ్వరని వారికి పూర్తిగా అర్ధం అయిపోయింది అని అంటున్నారు. టికెట్ ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకోవాలి కదా అనే వారంతా ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో వాటి నేతలతో దోస్తీ కడుతున్నారంట. మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారుట. ఈ రకమైన వ్యవహారం ద్వారానే రేపటి రోజున ఏదో ఒక పార్టీలో టికెట్ దక్కకపోతుందా అన్న ఆలోచనలో వారు ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే సొంత పార్టీ గెలిచిన పార్టీ అధికారంలో ఉన్న పార్టీలోని ఎమ్మెల్యేలు ఇలా నిరాశగా దైన్యంగా ఉన్నారూ అంటే అంతకంటే ఇబ్బందికరమైన పరిష్తితి వేరేది ఉంటుందా అన్నదే వైసీపీ సహా రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది.
ఇక ఈ మధ్య గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈ రోజు తాను వైసీపీ రేపటి రోజున ఏ పార్టీలో ఉంటానో అంటూ చేసిన కామెంట్స్ కూడా ఇలనటి పరిస్థితులను చూసి వచ్చినవే అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి చూసిన వారు అంతా అంటున్న ఒకే ఒక మాట ఏంటి అంటే అయ్యో పాపం అనేనట.