Begin typing your search above and press return to search.
వైసీఎల్పీ నేతగా జగన్..రేపు వైసీపీ కీలక తీర్మానం
By: Tupaki Desk | 24 May 2019 3:18 PM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన విపక్ష వైసీపీ... ఇక అధికార పార్టీగా మారిపోయింది. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహోరాత్రులు శ్రమించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...విపక్ష నేత హోదాలో నుంచి నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అందుకోసం ఈ నెల 30ని శుభ ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించిన వైసీపీ చర్యలు మొదలుపెట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలంటే... వైఎస్పార్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికవ్వాలి కదా. ఇది లాంఛనమే అయినా... ఆ ప్రక్రియ జరగాల్సిందే కదా.
ఇందు కోసం వైఎస్సీర్సీపీ శాసనసభాపక్షం శనివారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానుంది. ఈ భేటీలోనే జగన్ ను వైసీఎల్పీ నేతగా జగన్ ను పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నునున్నారు. ఆ తర్వాత ఆ తీర్మానం కాపీని పట్టుకుని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కనున్న జగన్... తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. ప్రజలు నిర్దేశించిన తీర్పు ప్రకారం తాను ఈ నెల 30న ఏపీ సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నట్లుగా ఆయన గవర్నర్ కు ప్రతిపాదించనున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటికే జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జగన్ ప్రజల సమక్షంలోనే సీఎంగా ప్రమాణం చేయాలని తీర్మానించుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా... ఆ ఏర్పాట్లను బెజవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు... శుక్రవారం జగన్ ను కలిసి వివరించారు. మరోవైపు తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరిని పిలవాలన్న కోణంలో జగన్ సమాలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఉన్న సమాచారం మేరకు ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయట. మొత్తంగా జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి.