Begin typing your search above and press return to search.

కడప ఎంపీ అవినాష్ విషయంలో జగన్ సీరియస్ డెసిషన్...?

By:  Tupaki Desk   |   18 Dec 2022 1:44 PM GMT
కడప ఎంపీ అవినాష్ విషయంలో జగన్ సీరియస్ డెసిషన్...?
X
కడప ఎంపీగా ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన జగన్ కి వరసకు తమ్ముడు అవుతాడు. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఆయనకు కడప ఎంపీ టికెట్ ని జగన్ ఇచ్చారు. ఆయన రెండు సార్లూ గెలిచి వచ్చారు. అయితే 2019 తరువాత మూడున్నరేళ్ల కాలంలో అవినాష్ రెడ్డి పెర్ఫార్మెన్స్ పెద్దగా ఏమీ లేదు. పైగా ఆయన మీద వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెట్టి చూసినపుడు న్యాయంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు కడప ఎంపీ సీటు ఇవ్వరనే అంటున్నారు. జగన్ కూడా ఆ విషయంలో సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇవ్వకుండా దాన్ని మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా ఇస్తారని అంటున్నారు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కడప సీటుని బలమైన సామాజికవర్గానికి ఇస్తారని అంటున్నారు. లేకపోతే తన మేనమామ అయిన రవీంద్రనాధ్ రెడ్డికి కూడా ఆ సీటు ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.

ప్రస్తుతం రవీంద్రనాధ్ రెడ్డి కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సీటు మారుదామని అనుకుంటున్నారుట. ఆ విషయం జగన్ ముందు చెప్పి ఉంచారని అంటున్నారు. ఇలా కడప జిల్లాలో సీట్ల మార్పుల నేపధ్యంలో అవినాష్ కి ఎంపీ సీటు దక్కదనే ప్రచారం సాగుతోంది. కడప ఎంపీ సీటులో మరోమారు పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న అవినాష్ రెడ్డికి ఇది ఇబ్బందికరమైన పరిణామమే అంటున్నారు.

అయితే జగన్ అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వకపోయినా ఎమ్మెల్యే సీటు అడ్జస్ట్ చేస్తారు అని అంటున్నారు. రాజంపేట నుంచి ఆయన్ని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారు అని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రాజంపేట నుంచి సిట్టింగ్ వైసీపీ ఎంపీ మేడ మల్లికార్జున రెడ్డి ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల వేళ టీడీపీ నుంచి జంప్ చేసి టికెట్ దక్కించుకుని పోటీ చేసారు.

ఆయన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారని, అది దక్కపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారంలో ఉంది. పైగా ఆయన వైసీపీ క్యాడర్ తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారుట. పక్క చూపులు చూస్తున్న మల్లికార్జున రెడ్డి టీడీపీకి తిరిగి వెళ్తారని అంటున్నారు. దాంతో రాజంపేట నుంచి అవినాష్ రెడ్డిని బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. రాజంపేటలో వైసీపీకి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వారు టికెట్ ఆశిస్తున్నారు కూడా. అయితే అవినాష్ రెడ్డికి బెర్త్ అక్కడ చూపించడం కోసం వారిని పక్కన పెడుతున్నారని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా కడప ఎంపీగా అవినాష్ రెడ్డికిఈసారికి టికెట్ దక్కదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.