Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎంపీ విన్న‌పానికి మోడీ ఓకే చెబుతారా?

By:  Tupaki Desk   |   8 July 2019 7:48 AM GMT
జ‌గ‌న్ ఎంపీ విన్న‌పానికి మోడీ ఓకే చెబుతారా?
X
జ‌గ‌న్ గురించి మోడీ మ‌న‌సులో ఏముంది? ఈ ప్ర‌శ్న‌ను స‌మాధానం ఎవ‌రిని అడిగినాచెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే.. త్వ‌ర‌లో ఈ విష‌యం మీద క్లారిటీ రావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అద్భుత‌మైన రీతిలో విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌టం తెలిసిందే.

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి.. ఏపీకి త‌మ సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని మోడీ ముద్దు ముద్దుగా మాట్లాడ‌టం.. తిరుప‌తి స‌భ‌లో బీరాలు ప‌ల‌క‌టం.. ఆ స‌భ‌కు ముందు ఎయిర్ పోర్ట్ లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా త‌న‌ను క‌లిసిన జ‌గ‌న్ ను అప్యాయంగా ద‌గ్గ‌ర తీసుకోవ‌టం లాంటి ప‌నులు చేయ‌టం ద్వారా యువ‌నేత మీద మోడీ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నార‌న్న మాట వినిపించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు లేక‌పోవ‌టం చూసిన‌ప్పుడు ఏపీ విష‌యంలో మోడీ క‌ర‌కుగానే ఉన్నారన్న భావ‌న ప‌లువురిలో క‌లిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాల‌శౌరి లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు.దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని పార్ల‌మెంటులో ఏర్పాటు చేయాల‌ని కోరారు.

రూపాయి డాక్ట‌రుగా వైఎస్ వైద్య సేవ‌లు అందించార‌ని.. ఫీజు రియింబ‌ర్స్ మెంట్.. ఆరోగ్య‌శ్రీ‌తో పాటు పోల‌వ‌రం.. పులిచింత‌ల ప్రాజెక్టుల‌తో జ‌ల‌య‌జ్ఞానికి శ్రీ‌కారం చుట్టిన వైనాన్నిపేర్కొన్నారు. పార్ల‌మెంటులో మ‌హానేత విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని స్పీక‌ర్ కు లేఖ రాసినా.. ప్ర‌భుత్వం ఓకే అన్నాకే అది కార్య‌రూపం దాలుస్తుంద‌న్న‌ది తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్ మీద అభిమానం త‌న‌కున్న విష‌యాన్ని చాటి చెప్పాల‌ని మోడీ భావిస్తే మాత్రం.. ఈ విష‌యం మీద వెంట‌నే స్పంద‌న ఉంటుంద‌ని.. లేనిప‌క్షంలో దీనిపై ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు ఉండ‌దంటున్నారు. యువ‌నేత విష‌యంలో మోడీ ఎలా వ్య‌వ‌హ‌రించనున్నార‌న్న విష‌యం ఈ ఇష్యూలో తేలిపోనుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.