Begin typing your search above and press return to search.
వైసీపీ ఎంపీపై తిరగబడ్డ వైసీపీ కౌన్సిలర్.. ఎక్కడ.. ఎందుకు?
By: Tupaki Desk | 31 May 2022 1:15 PM GMTమున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ అంతర్గత కుమ్ములాట జరిగింది. హిందూపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకుని వెళ్లాలంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ ను వైసీపీ మహిళా కౌన్సిలర్లు నిలదీశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఇంద్రజ, ఎంపీ గోరంట్ల మాధవ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా.. హిందూపురం మున్సిపాలిటీ ప్రాంతంలో డ్రైనేజ్, లైటింగ్, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారపార్టీ మహిళా కౌన్సిలర్లు సమస్యలు లేవనెత్తారు.
హిందూపురంలో ఏ ప్రభుత్వం వచ్చినా పీఏల రాజ్యం సాగుతోందని మహిళా కౌన్సిలర్ ఆరోపించారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎంపీ.. మహిళా కౌన్సిలర్ మాట్లాడుతున్న మైక్ కట్ చేయించారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు కౌన్సిలర్, కమిషనర్ ఎందుకంటూ వైసీపీ మహిళా కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. తాము కూడా ప్రజల నుంచి గెలిచామని.. ఎంపీ కూడా ప్రజల నుంచే వచ్చారని.. తమ సమస్యలే వినలేని ఎంపీ.. ఇక, ప్రజల సమస్యలను ఏం వింటారని ఆమె నిలదీశారు. ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే.. నాయకులు మాత్రం వినడం లేదని ఆమె చెప్పారు. దీంతో ఎంపీ గోరంట్ల చేసేదేమీ లేక సమావేశాన్ని ముగించారు.
సర్పంచులదీ అదే బాట..
వైసీపీ పాలనలో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు వాపోయారు. అనకాపల్లిలో నిర్వహించిన విశాఖ ఉమ్మడి జిల్లాల సర్పంచుల కమిటీ సమావేశంలో పాల్గొన్న గ్రామ ప్రథమ పౌరులు.. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. సర్పంచుల అధికారాలను పూర్తిగా హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలువురు సర్పంచులు వాపోయారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. గ్రామ సర్పంచ్ల నిధులు, విధులను ప్రభుత్వ గుప్పిట్లో పెట్టుకుకోవాలని చూస్తోందన్నారు.
14, 15వ ఆర్ధిక సంఘ నిధులను ప్రభుత్వం వాడుకోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని పేర్కొన్నారు. పంచాయతీల్లో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారారని.., సమస్యలు పరిష్కరించుకునేందుకు రాజకీయాలకతీతంగా సర్పంచులందరూ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీకి తిరిగి ఇవ్వటంతోపాటు సర్పంచుల గౌరవ వేతనం రూ.15 వేలు అందించాలని డిమాండ్ చేశారు. 1984 నుంచి మైనర్ గ్రామపంచాయతీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ విధానం కొనసాగించాలన్నారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థనుు పంచాయతీలో విలీనం చేయాలని కోరారు.