Begin typing your search above and press return to search.

న‌వ్విపోదురు గాక‌.. మాకేటి సిగ్గు!

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:35 AM GMT
న‌వ్విపోదురు గాక‌.. మాకేటి సిగ్గు!
X
కొద్ది రోజుల క్రితం ఒక మ‌హిళ‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయార‌ని అనంత‌పురం జిల్లా హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై అటు అధికార ప‌క్షం, ఇటు ప్ర‌తిప‌క్షం మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం న‌డిచింది. మాధ‌వ్ వీడియోపై విచార‌ణ చేయిస్తున్నామ‌ని.. నిజ‌మ‌ని తేలితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన వైఎస్సార్సీపీ అధిష్టానం ఆ త‌ర్వాత నాలుక మ‌డ‌తేసింద‌నే అభిప్రాయాలు ప్ర‌జ‌ల్లో, నెటిజ‌న్ల‌లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆ వీడియో నిజ‌మో, కాదో ఏ ల్యాబ్‌లోనూ నిర్ధార‌ణ‌ చేయించ‌కుండానే అనంత‌పురం ఎస్పీ ఫ‌క్కీర‌ప్ప‌తో అది నిజ‌మైన వీడియో కాద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న ఇప్పించ‌డంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేశాయి. మ‌రోవైపు అధికార పార్టీ నేత‌లు కూడా చంద్ర‌బాబు ఓటుకు నోట్లు కేసులో ఇరుక్కుపోయార‌ని.. ఇంత‌వ‌ర‌కు దానిపైన విచార‌ణ లేద‌ని.. చంద్ర‌బాబు రాజీనామా చేశారా అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక మ‌రోవైపు అనంత‌పురం ఎస్పీ ఫక్కీర‌ప్ప ఆ వీడియో నిజం కాద‌ని ప్ర‌క‌టించ‌డంతో మ‌రోమారు గోరంట్ల మాధ‌వ్ ప్ర‌తిప‌క్షాలపై, కొన్ని మీడియా చానెళ్ల‌పై బూతుల దండ‌కం ఎత్తుకున్నారు. కావాలంటే వాళ్ల ఇంటికి వ‌చ్చి త‌న అస‌లు చూపిస్తానంటూ రాయ‌లేని, ప‌ల‌క‌లేని భాష‌లో నిప్పులు చెరిగారు.

ఇప్ప‌టికే ఎంపీ మాధ‌వ్ న్యూడ్ వీడియో వ్య‌వ‌హారం, ఆయ‌న అస‌భ్య భాష‌పై ప్ర‌జ‌లు, నెటిజ‌న్ల‌లో తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ విష‌యంలో ఇలాంటి వ్య‌క్తిపై చ‌ర్య తీసుకోనందుకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుని నెటిజ‌న్లు, ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అయితే వైఎస్సార్సీపీ అధిష్టానం టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ జ‌ర‌గ‌లేదా అంటూ ఆ అంశాల‌ను లేవ‌నెత్తుతున్నారు.

గోరంట్ల మాధ‌వ్ బూతులు చాల‌వ‌న్న‌ట్టు ఆయ‌న‌కు ఇప్పుడు 500 కార్ల కాన్వాయ్‌తో భారీ స్వాగ‌తం ప‌ల‌క‌డానికి ఏర్పాట్లు చేశార‌నే వార్త నెటిజ‌న్లు, ప్ర‌జ‌ల్లో తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. న‌వ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న‌ట్టు చేసిన వెధ‌వ ప‌ని చాల‌క మ‌ళ్లీ స్వాగ‌త స‌త్కారాలు కూడానా అనే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆగ‌స్టు 14, ఆదివారం గోరంట్ల మాధ‌వ్ త‌న నియోజ‌క‌వ‌ర్గం హిందూపూర్ రానున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు 500 కార్ల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నార‌నే వార్త నెటిజ‌న్ల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. దీనిపై సోష‌ల్ మీడియాలో ఓ రేంజులో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏం ఘ‌న‌కార్యం సాధించాడ‌ని మాధ‌వ్‌కు ఈ స్వాగ‌త స‌త్కారాలు అని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అని విలువ‌లు, వలువ‌లు వ‌దిలేసినవారికి చీమ అయినా కుట్ట‌డం లేద‌ని నిట్టూరుస్తున్నారు.