Begin typing your search above and press return to search.

జగన్ విత్ రఘురామ : ఇద్దరినీ ఒకే చోట చూస్తే అదిరిపోవాల్సిందే...?

By:  Tupaki Desk   |   17 Jun 2022 3:30 AM GMT
జగన్ విత్ రఘురామ : ఇద్దరినీ ఒకే చోట చూస్తే అదిరిపోవాల్సిందే...?
X
ఆయన టెక్నికల్ గా చూస్తే వైసీపీ ఎంపీ. నర్సాపురం ఉంచి 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తన చిరకాల ముచ్చట అలా తీర్చుకున్నారు. ఆయనే ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. ఆయన మొదట కాంగ్రెస్ వాది. వైఎస్సార్ ముఖ్య అనుచర గణంలో ఆయన కూడా ఉండేవారు. వైఎస్సార్ టైమ్ లోనే పోటీకి ప్రయత్నాలు చేసినా ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ తరువాత జగన్ సైడ్ వచ్చారు. 2014 ఎన్నికల ముందు వరకూ జగన్ తోనే ఉన్నారు. ఆయనకే నర్సాపురం టికెట్ అని కూడా అనుకున్న టైమ్ లో ఆయన బీజేపీలో చేరిపోయారు.

ఇక జగన్ మీద ఒక టీడీపీ అనుకూల మీడియా ఇంటర్వ్యూలో కూడా దారుణంగా మాట్లాడారు. జగన్ని అపరిచితుడు అని కూడా బిరుదు ఇచ్చారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి టికెట్ కోసం ట్రై చేశారు. మరి ఎందుకో కుదరలేదు దాంతో వైసీపీలో చేరిపోయారు. నిజానికి జగన్ తనను తిట్టిన వారిని ఎవరినీ దరి చేయనీయరు అంటారు. రఘురాముడు మాత్రం ఒక స్పెషల్ కేసుగానే ఉన్నారు.

ఆయన ఇలా చేరి అలా నర్సాపురం టికెట్ సాధించారు. ఇక భారీ పోటీ ఉన్నా నెగ్గి చూపించారు. ఆరు నెలల పాటు ఇద్దరి మధ్య సయోధ్య సాగినా ఆ తరువాత అనేక కారణాల వల్ల విభేదాలు వచ్చాయి. అంతే గత రెండున్నరేళ్ళుగా రఘురామ వర్సెస్ జగన్ అన్నట్లుగా రాజకీయ పోరు సాగుతోంది.

విపక్షం కంటే జగన్ని ఎక్కువ విమర్శించారు అన్న పేరు కూడా రఘురామకు ఉంది. ఇదిలా ఉంటే జగన్ తనతో పడని వారి ముఖం ఎపుడూ చూడాలనుకోరు అంటారు. ఇక రఘురామ సైతం జగన్ కి దూరంగానే ఉంటూ వస్తున్నారు. కానీ ఈ ఇద్దరూ కనిపించే ఒక వేదిక అయితే రెడీ అవుతోంది.

అది భీమవరం అన్న మాట. జూలై నాలుగవ తేదీన భీమవరం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రారభించనున్నారు. ఇది నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాంతో రఘురామ క్రిష్ణం రాజు కూడా కచ్చితంగా హాజరవుతారు అంటున్నారు.

పైగా ప్రధాని తమ ప్రాంతానికి వస్తూంటే లోకల్ ఎంపీగా ఆయన హాజరు కావడం తప్పనిసరి. ఇక మోదీతో బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం మూలంగా కూడా రాజు గారి ఈ ప్రోగ్రాం కి వస్తారు అంటున్నారు. అలాగే అల్లూరి జయంతి అంటే అది కూడా గర్వకారణం అయిన కార్యక్రమం. దాంతో రాజు గారి రాక కన్ ఫర్మ్ అయింది.

ఇక సీఎం హోదాలో జగన్ సైతం భీమవరం సభలో పాలుపంచుకుంటారు. అంటే ప్రధాని సమక్షంలో రఘురామ క్రిష్ణం రాజు జగన్ అలా కలుసుకుంటారు అన్న మాట. ఇద్దరూ మాట్లాడుకునే సీన్ అయితే ఉండదేమో కానీ ఒక చోట కొంత సేపు అయినా కనిపించడం కూడా ఇపుడున్న రాజకీయ పరిస్థితులలో అరుదు అనే చెప్పాలి. మొత్తానికి జాలై నాలుగున జరిగే ఈ విడ్డూరాన్ని చూసేందుకు అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.