Begin typing your search above and press return to search.

ర‌ఘు రామ రామ : ఆ భ‌యాలు తీరేనా ?

By:  Tupaki Desk   |   3 July 2022 6:30 AM GMT
ర‌ఘు రామ రామ : ఆ భ‌యాలు  తీరేనా ?
X
నిన్న‌టి వేళ తిరుగుబాటు ఎంపీ (వైసీపీ) ర‌ఘు రామ కృష్ణం రాజుకు, ఎంపీ సాయిరెడ్డికి మ‌ధ్య వాగ్వాదం న‌డిచింది. ట్విట‌ర్ వేదిక‌గా త‌న‌ను ఉద్దేశించి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య లకు ట్రిపుల్ ఆర్ కౌంట‌ర్లు ఇచ్చారు. మీసం మెలేస్తూ ఘాటు వ్యాఖ్యలతో వీడియో విడుద‌ల చేశారు. ముఖ్య‌మంత్రినీ, సాయిరెడ్డినీ మ‌ళ్లీ మ‌ళ్లీ టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు అన్నారు. ముఖ్యంగా సాయిరెడ్డిని రాయ‌లేని భాష‌లో తిట్లు తిట్టారు. ఇవ‌న్నీ వైర‌ల్ అవుతున్నాయి. తాను భయపడుతున్నాను అని చెప్పే సాయిరెడ్డి, ఆయన నాయకుడు... ఏ భయం వల్ల తన ఇంటికి వెళ్లే రోడ్డు తవ్వారు? అని ప్రశ్నించారు రఘురామరాజు.

భీమ‌వ‌రంలో జరిగే అల్లూరు జ‌యంత్యుత్స‌వాల‌కు తాను వ‌స్తున్నాన‌ని తెలుసుకుని ఈ విధంగా చేశార‌ని చెప్పారాయ‌న. ఇక తాజాగా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న్ను ఏ క్ష‌ణంలో అయినా అరెస్టు చేస్తార‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.హైకోర్టు చెప్పినా కూడా శాంతి భ‌ద్ర‌త‌ల నెపాన ఆయ‌న్ను అరెస్టు చేస్తే ప‌రిణామాలు తీవ్రంగానే ఉంటాయ‌ని సంబంధిత వ‌ర్గాల‌తో పాటు బీజేపీ శ్రేణులు కూడా భీమ‌వ‌రం కేంద్రంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. త‌నపై ప్రభుత్వం దాడికి ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ర‌ఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌న‌పై భౌతిక దాడికి ఆస్కారం ఉందంటూ ప్ర‌ధాని కార్యాల‌యానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీఎంఓ అద‌న‌పు కార్య‌ద‌ర్శి కి ఓ లేఖ కూడా రాశారాయ‌న. దీంతో కేంద్రం ఆయనకు ఈ పర్యటన కోసం ప్రత్యేకంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది.

త‌న ఇంటికి వెళ్లే దారిని త‌వ్వేయ‌డం వ‌ల్ల తాను న‌డుచుకుంటూ చేరుకోవాల్సి వ‌స్తుంద‌ని, ఐదు వంద‌ల మీట‌ర్లు మేర‌కు న‌డ‌వాల్సి వ‌స్తుంద‌ని, ఈ స‌మ‌యంలో త‌న‌పై దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని నిన్న కూడా ఆయ‌న అంచనా వేశారు. ఇదేవిష‌యం లేఖ‌లోనూ పేర్కొన్నారు. అంతా బహిరంగం కావడంతో త‌వ్విన రోడ్డును అధికారులు పూడ్చివేశార‌ని తెలుస్తోంది. అయితే తాను ఎటునుంచి బ‌య‌లు దేరి వ‌స్తానో కూడా తెలియ‌ద‌ని అంటూ మ‌రో స‌స్పెన్స్ ఇచ్చారు. ఇక ఆయ‌న రాక నేప‌థ్యంలో ఇంకెన్ని ట్విస్టులు ఉండ‌నున్నాయో ?