Begin typing your search above and press return to search.

నోటిదురుసే చేటు తెస్తోందా ?

By:  Tupaki Desk   |   10 July 2022 4:35 AM GMT
నోటిదురుసే చేటు తెస్తోందా  ?
X
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీకి వస్తున్న సమస్యల్లో అత్యధికం తన నోటిదురుసు వల్లే వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న వ్యవహారాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్ధమైపోతుంది. ప్రభుత్వాన్ని విమర్శించటం మానేసి జగన్మోహన్ రెడ్డిని డైరెక్టుగా నోటికొచ్చినట్లు మాట్లాడటంతోనే ఆయనకు సమస్యలు పెరిగిపోయాయి. ప్రభుత్వ విదానాలను ఎంపీ విమర్శించనంత కాలం ఎవరు పట్టించుకోలేదు.

తనను నేతలు పట్టించుకోవటం లేదన్న మంటతో ఎంపీ జగన్ పై డైరెక్టుగా ఆరోపణలు, విమర్శలకు దిగారు. దాంతోనే ఎంపీకి సమస్యలు మొదలైపోయాయి. ఎలాగైనా సరే జగన్ను ఇబ్బందులు పెట్టాలని, జైలుకు పంపాలన్న ఏకైక టార్గెట్ తో ఎంపీ కోర్టుల్లో కేసులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ టికెట్ మీద గెలిచి జగన్ కి వ్యతిరేకంగా కేసులు వేసి ప్రతిరోజు బురదచల్లేస్తుండటంతో అందరికీ టార్గెట్ అయ్యారు.

సరే ఈ విషయాలన్నీ పక్కనపెట్టేస్తే తాజాగా ముగిసిన ప్లీనరీ అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఎంపీ చెప్పారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ప్లీనరీ ఫ్లాప్ అయ్యిందని ఎంపీ ఎలా చెప్పగలరు ? ప్లీనరీ విజయవంతమైందని అందరికీ తెలుసు. అలాంటిది ప్లీనరీ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చెప్పాల్సిన అవసరం ఎంపీకి లేదు. అయినా చెప్పాలంటే వైసీపీ నేతలను కెలకటమే ఎంపీ ఉద్దేశ్యంగా తెలిసిపోతోంది. వీసాలేని కారణంగా హాజరు కాలేకపోయినట్లు చెప్పుకున్న ఎంపీ ప్లీనరీ విజయవంతమైందో అట్టర్ ఫ్లాప్ అయ్యిందో ఆయనకెందుకు ?

పైగా జగన్ కోసం కష్టపడిన తల్లి, చెల్లి పార్టీ నుండి వెళ్ళిపోయారంటు అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎంపీ వైఖరి ఏమిటంటే ఏదోరూపంలో జగన్ను వ్యక్తిగతంగా పార్టీ నేతలను కెలకటమే అని తెలిసిపోతోంది. తన నోటిదురుసు వల్ల తనకు చేటు తెస్తోందని ఎంపీకి తెలిసి కూడా ఎంపీ వెనక్కు తగ్గటం లేదంటే పార్టీతో ఘర్షణనే కోరుకుంటున్నారని అర్ధమైపోతోంది.