Begin typing your search above and press return to search.
రెబెల్ రాజా వారికి కాకినాడ కాజా...?
By: Tupaki Desk | 19 Sep 2022 2:30 AM GMTవైసీపీలో రెబెల్ ఎంపీగా ఉన్న నర్సాపురం నాయకుడు రఘురామ క్రిష్ణం రాజుకు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో దాదాపుగా కన్ ఫర్మ్ అయినట్లే. ఆయన వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాకి షిఫ్ట్ అవుతారని లేటెస్ట్ టాక్. కాకినాడ ఎంపీగా రఘురామ క్రిష్ణం రాజు బరిలో ఉంటారని అంటున్నారు.
ఈ సీటు విషయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు జాగ్రత్తగా ఇప్పటి నుంచే వర్క్ చేసుకోమని రెబెల్ రాజా వారికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారుట. ఇక కాకినాడ సీటు విషయం తీసుకుంటే ఇది స్పెషల్ అనే చెప్పాలి. సిట్టింగ్ ఎంపీగా వైసీపీ తరఫున వంగా గీత ఉన్నారు. ఈ సీటులో గతంలో సినీ నటుడు క్రిష్ణం రాజు గెలిచారు. ఇక్కడ కాపుల ప్రాబల్యం ఉన్నా రాజులకు కూడా అదరణ ఉంది.
దాంతో పాటు జనసేన టీడీపీ పొత్తులు ఉంటే కాకినాడ సీటు గెలవడం డెడ్ ఈజీ అని కూడా రాజు గారు లెక్కలు వేసుకుంటున్నారుట. ఆయనకు కాకినాడలో ఉన్న గట్టి పరిచయాలను దృష్టిలో పెట్టుకుని తన యాక్షన్ ప్లాన్ ని మొదలెట్టేశారని అంటున్నారు. కాకినాడలో వార్ వన్ సైడ్ అని రాజు గారు నమ్ముతున్నారుట.
ఇక వంగా గీత ఎంపీగా మరోసారి పోటీకి విముఖంగా ఉన్నారు. అదే టైం లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెబుతున్నారు. అమె ప్లేస్ లో వైసీపీ ఎవరిని బరిలో పెట్టినా టీడీపీ జనసేన పొత్తు ఉంటే వైసీపీకి గెలుపు అవకాశాలు కష్టమే అని అంటున్నారు. దాంతోనే అన్ని లెక్కలూ వేసుకుని రాజు గారు ఇక్కడకు బదిలీ కావడానికి ఓకే చెప్పారని అంటున్నారు.
ఇకపోతే ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం సీట్లో జనసేన అయినా టీడీపీ అయినా పోటీ చేయడం ఖాయం. జనసేన నుంచి మెగా బ్రదర్ మళ్ళీ పోటీకి సిద్ధమని అంటున్నారు. అలా పొత్తులో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయవచ్చు అని చెబుతున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే టీడీపీ ఈ సీటు తీసుకుకుని సీనియర్ నేత వెంకట శివరామరాజును పోటీకి పెడుతుందని తెలుస్తోంది.
మొత్తానికి రెబెల్ రాజు గారు మంచి ధీమాగా ఉన్నారని అంటున్నారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో తాను గెలిచి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెడతాను అన్న నమ్మకం అయితే ఆయనలో ఉంది. బాబు సైతం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉండడమే కాక సీటు కూడా చూపించారన్న ప్రచారం ఇపుడు జోరుగా సాగుతోంది మరి.