Begin typing your search above and press return to search.
రెబెల్ రాజుకు పక్కలె బల్లెం లాంటి ప్రత్యర్ధి రెడీ...?
By: Tupaki Desk | 20 Nov 2022 5:44 PM GMTవైసీపీ ఎంపీ రఘురామ రామరాజు ఆ పార్టీ అధినాయకత్వానికి కంటిలో నలుసుగా మరారు. ఇలా ఎంపీ అయ్యారో లేదో అలా జగన్ కే ఎర్ర జెండా చూపించి ఎదురు నిలిచారు. హాయ్ కమాండ్ కి సలాం కొట్టకుండా గులాం కాకుండా దర్జాగా మూడున్నరేళ్ల పదవీకాలాన్ని హ్యాపీగా లాగించేశారు. ఉండేది ఢిల్లీలో.. రోజూ అక్కడ పెట్టేది రచ్చ బండ. కానీ రచ్చ రచ్చ అయ్యేది మాత్రం వైసీపీ.
ఇక రాజు గారికి అందరూ బంధువులే. అందరూ స్నేహితులే. అందరూ దగ్గరవారే. ఒక్క జగన్ తప్ప. ఆయనతోనే తనకు యుద్ధం. దానికి తాను సదా సిద్ధమని చెబుతూ రాజు గారు ఎప్పటికపుడు కత్తులు దూస్తారు. అన్ని మాటలూ అనేస్తూ తాను జగన్ కంటే ఏమైనా ఎక్కువ మాట్లాడానా అని అమాయకంగా ముఖం పెడతారు. ఏపీలో తానున్న పార్టీ అంచులు లేకుండా ఓడిపోతుంది అని ఏ ఎంపీ అయినా అనగలరా.
అది ఒక్క రెబెల్ రాజు గారికే సాధ్యం. అందుకే ఆయన గట్స్ ఉన్న ఎంపీని తాను అంటున్నారు. తాను సొంతంగా గెలిచాను అని జగన్ బొమ్మ అవసరం తనకు ఎపుడూ పడలేదని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పేసి అధినేతను ఫుల్ గా హర్ట్ చేశారు. మరి జగన్ బొమ్మ లేకుండా ఆయన ఈసారి వేరే బొమ్మలతో రెడీ అవుతున్నారు కూడా.
అన్నీ అనుకూలిస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ మద్దతుతో తిరిగి అదే నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రాజు గారు సిద్ధమవుతున్నారు. మరి ఆయనను ధీ కొట్టే అభ్యర్థిగా వైసీపీకి ఎవరు ఉన్నారు అన్నదే చర్చ. అయితే వైసీపీ ఇప్పటిదాక గోకరాజు గంగరాజు ఫ్యామిలీని నమ్ముకుంది. కానీ వారు అంత డైనమిక్ గా పాలిటిక్స్ చేయడం లేదు అంటున్నారు. దాంతో ఈ సీటు నుంచి సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి కనుమూరి బాపిరాజుని తెచ్చి పోటీకి నిలపాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
బాపిరాజు గతంలో రెండు సార్లు నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు. దాంతో పాటు ఆయనకు క్షత్రియ సామాజికవర్గంలో పెద్ద మనిషిగా పేరుంది. మీసాల రాజుగా అందరి మన్ననలు ఆయన అందుకున్నారు ఇతర సామాజికవర్గాల వారికి ఆయన అంటే అభిమనం నిండుగా మెండుగా ఉన్నాయి. దాంతో ఆయన్ని తమ పార్టీలోకి చేర్చుకుని రెబెల్ రాజుకు పోటీగా పెట్టాలని వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
జగన్ నర్సాపురం టూర్ సందర్భంగా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ఎన్ని పార్టీలతో కలసి వచ్చినా రెబెల్ రాజుని ఓడించి తీరాలన్నదే వైసీపీ అధినాయకత్వం అజెండాగా ఉంది అంటున్నారు. ఏపీలో మొత్తం లోక్ సభ సీట్లు ఒక ఎత్తు, నర్సాపురం మరో ఎత్తు అని అంటున్నారు.
వైసీపీకి జగన్ కి అతి పెద్ద ట్రబుల్ గా మారిన రెబెల్ రాజుని మాజీ చేయకపోతే వైసీపీకి ఇజ్జత్ కే సవాల్ అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మీసాల రాజు గారితో పోటీ పెట్టి రెబెల్ రాజుని వైసీపీ పెద్దలు ఓడిస్తారా అంటే ప్రచారం అయితే అలాగే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.