Begin typing your search above and press return to search.
సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ బంధువు
By: Tupaki Desk | 17 Oct 2022 9:33 AM GMTఢిల్లీ లిక్కర్ స్కాం అనేక మలుపులు తిరుగుతున్న విషయం విధితమే. ఎక్కడో తీగ లాగితే డొంక అంతా తెలుగు రాష్ట్రాల చుట్టూ కదులుతోంది అని కూడా చెబుతున్నారు. దానికి రుజువులుగా పలువురు రాజకీయ ప్రముఖులు పలుకుబడి కలిగిన వారి ఇళ్ళు ఆఫీసుల మీద సీబీఐ ఈడీ సోదాలు కూడా ఇప్పటికి పలు మార్లు చేసిన నేపధ్యం ఉంది. ఇదిలా ఉంటే సీబీఐ ఈ విషయంలో మరింత జోరు పెంచింది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేసింది. ఆయన్నే మొత్తం స్కాం లో ప్రధాన నిందితునిగా చూపిస్తోంది.
ఆయన్ని అరెస్ట్ కూడా చేస్తారు అని ఒక వైపు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇపుడు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద కూడా సీబీఐ కన్ను పడింది అంటున్నారు. ఆయన విషయం మీద ఈ లిక్కర్ స్కాం బయటపడినపుడు ప్రచారం సాగింది. అయితే ఇపుడు ఏకంగా ఆయన బంధువు ఒకరిని సీబీఐ తన వద్దకు పిలిపించుకుని విచారిస్తోంది అని అంటున్నారు. ఢిల్లీలోని సీబీఐ ఆఫీసులో ఇపుడు ఈ విచారణ జోరుగా సాగుతోంది అంటున్నారు.
దాంతో తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఏపీలో ఈ వ్యవహారం మీద రాజకీయ రచ్చ జరిగే అవకాశం ఉందా అన్న మాట వినిపిస్తోంది. ఇక ఈ కేసులో సీబీఐ ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. సిసోడియా మీద సీబీఐ ఆరోపణలు కూడా సీరియస్ గా ఉన్నాయి. మద్యం వ్యాపారులకు ఏకంగా 30 కోట్ల రూపాయల మినహాయింపు ఇచ్చారని, ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించి లైసెన్స్ హోల్డర్లకు వారి ఇష్టానుసారం పొడిగించారని సిసోడియాపై వచ్చిన ఆరోపణలను సీబీఐ తీవ్రంగా పరిగణిస్తోంది అంటున్నారు.
ఇక సిసోడియా మీద ee ఐపీసీ సెక్షన్ 120 బి కింద కేసు నమోదు చేసింది అంటే నేరపూరిత కుట్ర ఉందని పేర్కొంది. అలాగే, 477 ఏ సెక్షన్ కింద ఖాతాలలో తప్పుడు సమాచారం ఇవ్వడం కింద కేసులు పెట్టి సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఆయనతో పాటు ఢిల్లీకి అపట్ట్లో ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న అర్వ గోపీ కృష్ణ మీద కూడా సీబీఐ ఫోకస్ పెట్టింది. 2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో నిబంధనలను పాటించలేదన్నని ఆరోపణగా ఉన్నాయి.
అలాగే అప్పటి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీతో పాటు, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్ వంటి వారు లొక్కర్ స్కాం లో అత్యంత కీలక పాత్ర పోషించారని సీబీఐ భావిస్తోంది. దీంతో సీబీఐ ఈ కేసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటున్నారు.
ఇక్కడ రాజకీయ కోణం కూడా ఉంది. ఢిల్లీలో ఆప్ సర్కార్ అధికారంలో ఉంది. ఆప్ గుజరాత్ లో బీజేపీని సవాల్ చేస్తోంది. దాంతో ఆప్ మీద ఉక్కు పాదం మోపడానికి బీజేపీ ఒక్కర్ స్కాం ని ఆయుధంగా వాడుకుంటోంది అని అంటున్నారు. దాంతో ఆప్ మీద గురి పెట్టిన ఈ వ్యవహారం కావడంతో అంత సులువుగా వదిలిపెట్టరని అంటున్నారు. ఇపుడు ఈ లిక్కర్ స్కాం లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎవరైనా ఇరుక్కుంటే మాత్రం వారు కూడా కచ్చితంగా ఇబ్బందులు పాలు కాక తప్పదని అంటున్నారు. సో వైసీపీ ఎంపీ బంధువు సీబీఐ విచారణలో ఏమి చేప్పారు అన్నదే ఆసక్తికరమైన అంశంగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.