Begin typing your search above and press return to search.

బాబు ఎంత అస‌మ‌ర్థుడో చెప్పేశాడు

By:  Tupaki Desk   |   8 Feb 2018 5:05 AM GMT
బాబు ఎంత అస‌మ‌ర్థుడో చెప్పేశాడు
X
ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కంటే పార్టీ పొలిటిక‌ల్ ప్ర‌యోజ‌నాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లుంది ఏపీ నేత‌ల తీరు చూస్తుంటే. కేంద్రానికి మిత్ర‌ప‌క్షంగా ఉంటూ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా నిధులు మంజూరు చేయించుకోలేని దీన స్థితిలో ఉన్న అధికార‌ప‌క్షం చేత‌కానిత‌నంపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు ఏపీ విప‌క్ష ఎంపీ క‌మ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వ‌ర‌ప్ర‌సాదరావు. గ‌డిచిన నాలుగు బ‌డ్జెట్ లో ఏపీకి అవ‌స‌ర‌మైన నిధులు మంజూరు చేయించుకోవ‌టంతోపాటు.. విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్నినెర‌వేర్చే అంశంపై మోడీ స‌ర్కారు నుంచి సానుకూల‌త సంపాదించ‌టంలో వైఫ‌ల్యం చెందిన బాబు తీరుపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ఎంతో చేస్తాన‌న్న మాట‌తో పాటు.. తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చినంత‌నే విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని స‌రిదిద్దుతాన‌ని చెప్పిన ప్ర‌ధాని మోడీ.. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయిన వైనంపై తీవ్ర అసంతృప్తిని ఇప్ప‌టికే వ్య‌క్త‌మ‌వుతోంది. చేయాల్సిన ప‌నుల్ని చేయించుకోవ‌టంలో చేత‌కానిత‌నాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకు విప‌క్షంపై ఎదురుదాడిని షురూ చేసింది ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీలు. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మాట్లాడుతూ.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని.. ఆ పార్టీ అధినేత‌పై సంధించిన విమ‌ర్శ‌ల‌పై వ‌ర‌ప్ర‌సాద‌రావు తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేశారు.

త‌మ అధినేత‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారంటూ టీడీపీ ఎంపీపై విరుచుకుప‌డ్డారు. త‌మ అధినేత‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంతో త‌మ అధినేత కుమ్మ‌క్కు అయిన‌ట్లుగా ఆరోపించార‌ని.. అదే నిజ‌మైన ప‌క్షంలో సిల్లీ కార‌ణాల‌తో 16 నెల‌లు జైల్లో ఉండేవారు కాద‌న్నారు. లేని వ్య‌క్తి గురించి స‌భ‌లో మాట్లాడటం మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు. త‌మ అధినేత జ‌గ‌న్ పై చేసిన వ్యాఖ్య‌ల్ని రికార్డుల నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించిన ఉప స‌భాప‌తి.. అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు ఉంటే తొల‌గిస్తామ‌న్నారు. బ‌డ్జెట్ పై చ‌ర్చ‌లో భాగంగా త‌మ‌కూ అవ‌కాశం ఇవ్వాల‌న్న జ‌గ‌న్ పార్టీ ఎంపీకి మాట్లాడే అవ‌కాశాన్ని ఇచ్చారు.

ఏపీ ముఖ్య‌మంత్రి పూర్తిగా అస‌మ‌ర్థుడ‌ని.. కేంద్రంలో నాలుగేళ్లుగా.. రాష్ట్రంలోనూ అదే కాలంపాటు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌లిగిన లాభం ఏమీ లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పున‌ర్ వ్య‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌లేద‌న్న ఆయ‌న‌.. ప‌ట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జ‌రిగిందన్నారు. ఇదే విష‌యాన్ని కాగ్ కూడా త‌ప్పు ప‌ట్టింద‌ని.. ఈ నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టు ప‌నుల‌పై కేంద్ర స‌ర్కారు సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌న్నారు. మ‌రి.. వ‌ర‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌ల‌పై కేంద్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.