Begin typing your search above and press return to search.
మాల్యాతో లండన్లో బాబు భేటీ!..ఎప్పుడో తెలుసా?
By: Tupaki Desk | 2 April 2018 10:26 AM GMTసంచలన విషయం బయటకు వచ్చింది. వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకులకు టోపీ పెట్టి లండన్ కు జంప్ అయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ సంచలన ఆరోపణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టారు.
తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బ్యాంకులకు పెద్ద ఎత్తున ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన మాల్యాను పది రోజుల అనంతరం సీఎం చంద్రబాబు భేటీ అయ్యారన్నారు. 2016 మార్చి 12.. 13.. 14 తేదీల్లో మాల్యాను లండన్లో కలిశారా? లేదా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. 2014 సార్వత్రిక ఎన్నికల కోసం విజయ్ మాల్యా నుంచి రూ.150 కోట్లు విరాళం కింత తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. మాల్యా నుంచి తీసుకున్న విరాళాలకు సంబంధించి బాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీస్తున్నారు.
హోదా సాధనలో భాగంగా మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న బాబుపై విజయసాయి చేసిన ఆరోపణ పిడుగు మాదిరి మారి.. సంచలనమైంది. ఎన్నికల సందర్భంగా పార్టీ ఫండ్ తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. దేశం విడిచి పారిపోయిన తర్వాత లండన్లో రహస్యంగా భేటీ అయ్యారన్న ఆరోపణపై బాబు ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే.. బాబుపై రాజ్యసభ ఛైర్మన్ కు విజయసాయి ప్రివిలేజ్ మోషన్ నోటీసులు అందజేశారు. యూటర్న్ అంకుల్ బాబు ఎందుకు ఢిల్లీ వస్తున్నారని ప్రశ్నించిన విజయసాయి.. గతంలో అన్ని పార్టీలతో జత కట్టి తర్వాత అందరిని వదిలేసిన ఆయన మళ్లీ ఢిల్లీకి రావటంలో ఉద్దేశం ఏమిటన్నారు. మళ్లీ పార్టనర్స్ కోసం ఢిల్లీకి వస్తున్నారా? అంటూ నిలదీశారు. విజయసాయి ఆరోపణలు సంచలనంగా మారటమే కాదు.. బాబును పెద్ద ఇరకాటంలో పడేశాయన్న మాట వినిపిస్తోంది.