Begin typing your search above and press return to search.
ఖురేషీ, సానాలతో రవిప్రకాశ్ లింక్... సుప్రీంకు సాయిరెడ్డి కంప్లైంట్!
By: Tupaki Desk | 7 Oct 2019 4:13 PM GMTటీవీ 9 మాజీ సీఈఓ, ఆ సంస్థ నుంచి దాదాపుగా గెంటేయబడ్డ రవిప్రకాశ్ కు నిజంగానే సీన్ సితార్ అవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీవీ 9 నిధుల గోల్ మాల్, ఫోర్జరీ, మోసం తదితర కేసుల్లో చిక్కుకున్న రవిప్రకాశ్... తాజాగా కఠినమైన ఫెమా చట్టాలను ఉల్లంఘించారన్న కోణంలో ఇప్పుడు నేరుగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు వెళ్లింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్ పై సీబీఐ విచారణతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తోనూ విచారణ చేయించాలని కూడా సాయిరెడ్డి తన లేఖలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరిన వైనం ఇప్పుడు నిజంగానే కలకలం రేపుతోంది. రవిప్రకాశ్ పాల్పడ్డ సరికొత్త నేరాలు ఇవేనని, ఇప్పటికే సీబీఐ, ఈడీ ఉచ్చులో ఇరుక్కున్న సానా సతీష్, మొయిన్ ఖురేషీలతో కలిసి రవిప్రకాశ్ లెక్కలేనంత మందిని మోసం చేశారని, ఈ మోసాల ద్వారా సంపాదించిన మొత్తాలను ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని కూడా సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఫిర్యాదులో రవిప్రకాశ్ కు చెందిన చాలా అవినీతి వ్యవహారాలను సాయిరెడ్డి పక్కా ఆధారాలనే పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటుగా ఆదాయపన్నును కూడా ఎగ్గొట్టిన రవిప్రకాశ్ పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడగట్టారని సాయిరెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులను మోసం చేసిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీతో పాటు దేశంలోనే సంచలనం రేకెత్తిన పలు కీలక కేసుల్లో పాత్ర ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొనడంతో పాటుగా సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న మన తెలుగు నేలకే చెందిన సానా సతీష్ తో కలిసి రవిప్రకాశ్ మోసాలకు పాల్పడ్డారని కూడా సాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురూ కలిసి ప్రముఖ నగల వ్యాపారి సుఖేశ్ గుప్తాను నకిలీ డాక్యుమెంట్లతో బెదిరించి హవాలా తరహా అక్రమాలకు పాల్పడ్డారని కూడా సాయిరెడ్డి తెలిపారు. హవాలా మార్గం ద్వారా సంపాదించిన సొమ్మును రవిప్రకాశ్ దేశం దాటించేసి... ఆ సొమ్ముతో కెన్యా, ఉగాండాల్లో సిటీ కేబుల్ లో పెట్టుబడులను పెట్టారని కూడా సాయిరెడ్డి సంచలన విషయాన్ని బయటపెట్టారు
ఫెమా, హవాలా తరహా కార్యకలాపాలకు రవిప్రకాశ్ పాల్పడుతున్నారని.. ఏదో అలా వేక్ గా ఆరోపణలు చేయకుండా సాయిరెడ్డి... రవిప్రకాశ్ పై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి పక్కా ఆధారాలను కూడా తన ఫిర్యాదుకు జత చేసి సుప్రీంకోర్టుకు సమర్పించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రవిప్రకాశ్ కు చెందిన అవినీతి కార్యకలాపాలను, ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థల జాబితాను కూడా సాయిరెడ్ది తన ఫిర్యాదుకు జత చేసినట్టు సమాచారం. మొత్తంగా సాయిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపితే రవిప్రకాశ్ కు భవిష్యత్తు అంతా చీకటేనన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉంటున్న రవిప్రకాశ్ ఇక బయటకు వచ్చే అవకాశాలే లేవన్న రీతిలోనూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో?