Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డికి రాజ్యసభ సచివాలయం ప్రశంస

By:  Tupaki Desk   |   12 Feb 2020 5:16 PM GMT
విజయసాయిరెడ్డికి రాజ్యసభ సచివాలయం ప్రశంస
X
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిపై రాజ్యసభ ప్రశంసలు కురిపించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రశంసనీయ మైన రీతిలో క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన పనితీరును మెచ్చుకుంది. బడ్జెట్ సెషన్‌ లో 155 మంది ఎంపీలు మాట్లాడారు. ఇందులో విజయసాయి బెస్ట్ పార్టిసిపెంట్ అని రాజ్యసభ సచివాలయం కితాబిచ్చింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన బులెటిన్‌ లో పేర్కొంది.

బడ్జెట్ సెషన్‌ లో తొమ్మిది అవకాశాలను ఆయన సమర్థవంతంగా వినియోగించుకున్నారని పేర్కొంది. జీరో అవర్ - ప్రత్యేక ప్రస్తావన - ఒక మౌఖిక ప్రశ్ - మౌఖిక ప్రశ్నలకు నాలుగు అనుబంధ ప్రశ్నలు అడిగినట్లు తెలిపింది. వీటితో పాటు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ - బడ్జెట్ పైన చర్చలో పాల్గొన్నారని పేర్కొంది.

ప్రజా సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తనకు ఉన్న అవకాశాల్ని సంపూర్ణంగా వినియోగించుకున్నారని - తొమ్మిదిసార్లు కూడా చర్చల్లో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని కనబరిచారని రాజ్యసభ సచివాలయం తన బులెటిన్‌ లో పేర్కొంది.

రాజ్యసభ సమావేశాల్లో 155 మంది (69 శాతం) సభ్యులు జీరో అవర్ - ప్రత్యేక ప్రస్తావనలు - రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ - బడ్జెట్‌ పై చర్చ - బిల్లులపై మాట్లాడారు. మిగతా వారిలో పీఎల్ పునియా - హుసేన్ దాల్వాయి - ఎంకే ఝా - అమర్ పట్నాయక్ - రవి ప్రకాశ్ వర్మ - డాక్టర్ అశోక్ బాజ్‌ పాయి - అమర్ శంకర్‌ లు ఒక్కొక్కరు ఐదు అవకాశాలు ఉపయోగించుకున్నట్లు తెలిపింది.

తొమ్మిది షెడ్యూల్డ్ సిట్టింగ్‌ లలో 41 గంటల 10 నిమిషాల షెడ్యూల్ అందుబాటులో ఉండగా 38 గంటల 30 నిమిషాలు పని చేసినట్లు తెలిపింది. సభలో అంతరాయం, వాయిదాల కారణంగా ఫిబ్రవరి 3న 5 గంటల 32 నిమిషాల సభా సమయం వృథా అయిందని పేర్కొంది. సభ్యులు షెడ్యూల్‌ కు మించి 3 గంటల 56 నిమిషాలు ఎక్కువ సమయం కూర్చున్నారని, దీంతో సభ షెడ్యూల్ సమయం నష్టం 1 గంటా 36 నిమిషాలకు తగ్గిందని తెలిపింది.