Begin typing your search above and press return to search.

రాజీనామాల ఆమోదానికి వైసీపీ ఎంపీల పట్టు

By:  Tupaki Desk   |   28 May 2018 5:50 PM GMT
రాజీనామాల ఆమోదానికి వైసీపీ ఎంపీల పట్టు
X
మంగళవారం లోక్ సభ స్పీకరును కలవనున్న వైసీపీ ఎంపీలు తమ రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తేనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం తీరుకు నిరసనగా ఏప్రిల్ 6న రాజీనామాలు చేసిన వైసీసీపీ ఎంపీలు ఆ తరువాత దిల్లీలో దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పటి నుంచి వారి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. అయితే.. మంగళవారం వచ్చి కలవాలంటూ లోక్ సభ స్పీకరు నుంచి వారికి పిలుపు రావడంతో వారంతా దిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయం వారు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ తో సమావేశం కానున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం తామంతా రాజీనామాలు చేశామని.. వాటిని ఆమోదించకపోవడానికి కారణమేమీ లేదని.. అందుకే ఆమోదించాలని స్పీకరుపై తామంతా ఒత్తిడి తెస్తామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. అయిదుగురు ఎంపీలూ మంగళవారం స్పీకరును కలిసి తమ వాదన వినిపిస్తామని అంటున్నారు.

కాగా స్పీకరు వారి రాజీనామాలను ఆమోదిస్తే ఆయా నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీలో రాజకీయం వేడెక్కగా.. వీరి రాజీనామాల ఆమోదంతో మళ్లీ ఎన్నికలు వస్తే 2019 సాధారణ ఎన్నికల ముందు ఇది కీలకం కానుంది. మరోవైపు టీడీపీ - జనసేన కూడా ప్రత్యేక హోదా అజెండాతోనే ప్రజల్లోకి వెళ్తుండగా.. వైసీపీ వారికంటే మరో అడుగు ముందుకేసి రాజీనామాలు కూడా చేయడంతో ప్రజల్లో వారి చిత్తశుద్ధిపై నమ్మకం కనిపిస్తోంది.