Begin typing your search above and press return to search.
స్టెబిలిటీయే లేదు.. క్రెడిబులిటీ ఇంకెక్కడిది బాబూ!!
By: Tupaki Desk | 4 April 2018 1:58 PM GMTఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ మీడియాకు చుక్కలు చూపిస్తూ నిర్వహించిన సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్సులో ఆయన పదేపదే క్రెడిబులిటీ అన్న మాట వాడుతూ తానెంతో నమ్మకస్థుడునన్న మెసేజ్ మిగతా పార్టీలకు - సొంత పార్టీ వర్గాలకు, ఏపీ ప్రజలకు పంపించడానికి శతవిధాలా ప్రయత్నించడం కనిపించింది. అయితే.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో స్టెబిలిటీ చూపించని టీడీపీ - చంద్రబాబులకు ఎంత క్రెడిబులిటీ ఉంటే మాత్రం ఏం లాభం అన్న విమర్శలు అక్కడే వినిపించాయి. ప్రధానంగా చంద్రబాబు క్రెడిబులిటీ అన్న మాట పలికిన ప్రతిసారీ అంతా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల విషయంలో చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలు - మార్చిన మాటలను గుర్తు చేసుకున్నారు. మాట మీద నిలబడని చంద్రబాబు ఇప్పుడు క్రెడిబులిటీ గురించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తోందని వైసీపీ ఎంపీలు అంటున్నారు.
బీజేపీతో అంటకాగిన సమయంలో ఆ పార్టీ ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తానంటే సరేననడం.. ప్రత్యేక హోదా పేరెత్తితే అరెస్టులు చేయిస్తాననడం వంటి చంద్రబాబు పాత మాటలను దిల్లీ రాజకీయ - పాత్రికేయ వర్గాల్లో సైతం చర్చకొచ్చింది. హోదాతో లాభం లేదని, ప్యాకేజీ దానికంటే నయమని ఇంతకాలం చెప్పి ఇప్పుడు బీజేపీకి దూరం జరిగాక మళ్లీ హోదా అంశాన్ని లేవనెత్తి హడావుడి చేయడం ఎన్నికల స్టంటేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాదు... పార్టీలోనూ చాలామంది పదవుల విషయంలో చంద్రబాబు నుంచి పొందిన హామీలు నెరవేరకపోవడంతో వారంతా ఇప్పుడు క్రెడిబులిటీ గురించి చంద్రబాబే మాట్లాడాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అన్నిటికీ మించి టీడీపీతో పాటుగానే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీని కలుపుకొని పోకుండా దిల్లీ వచ్చి హడావుడి చేయడంలోనే ఆయన క్రెడిబులిటీ ఎంతో తెలిసిపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.