Begin typing your search above and press return to search.
పోలవరంపై వైసీపీ దూకుడు మామూలుగా లేదే
By: Tupaki Desk | 23 Dec 2017 7:16 AM GMTఏపీలో కీలక అంశంగా చర్చల్లో సాగుతున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధనాప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన ముందడుగు వేసిందని చర్చ జరుగుతోంది. పోలవరం నిధుల విషయంలో పెద్ద ఎత్తున సంశయాలు నెలకొన్న వైసీపీ ఎంపీలు ముందుకు సాగుతున్నతీరు వైసీపీకి మేలు చేసేదిగా టీడీపీకి నష్టం కలిగించే రీతిలో ఉందంటున్నారు. 2019 సంవత్సరంలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - వై. విజయసాయిరెడ్డి - వైఎస్ అవినాష్ రెడ్డి - వరప్రసాద్ లు కేంద్ర జలవనరుల శాఖామంత్రి గడ్కరీని కోరారు.
పోలవరం నిర్మాణం - డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ - దుగరాజుపట్నం పోర్టు ఏర్పాటు అంశాలపై గడ్కరీతో వారు శుక్రవారం నాడు చర్చించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ప్రధానితో చర్చించాలని కేంద్రమంత్రిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరారు. లాభాలలో నడుస్తున్న విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పాలని కేంద్రమంత్రిని కోరడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని కేంద్రమంత్రిని కోరామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్లడించారు. దుగ్గరాజపట్నం పూర్తి చేయాలని కోరామన్నారు. అదే విధంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రైవేటీకరణ వల్ల జాతీయ భద్రతకు ముప్పు వస్తుందన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
ప్రత్యేక హోదా విషయాన్ని కూడా కేంద్రమంత్రితో చర్చించామని వైఎస్ ఆర్ సీపీ ఎంపీలు తెలిపారు. హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. మా రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఈ క్షణమే పదవులు వదులుకుంటామని వారు పునరుద్ఘాటించారు. పార్లమెంట్ - రాజ్యసభల్లో హోదా కోసం పోరాడుతున్నామని చెప్పారు. తాము రాజీనామా చేస్తే కేంద్రాన్ని పార్లమెంట్ లోనూ బయట ప్రశ్నించడానికి ఎవరూ ఉండరని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికలను అత్యంత ధనికంగా తయారు చేశారని ఆరోపించారు. సామాన్యులు ఎన్నికలలో పోటీ చేయడానికే లేకుండా చేసేశారని చెప్పారు.