Begin typing your search above and press return to search.
లోక్ సభలో జగన్ పార్టీ ఎంపీల తాజా సీట్ల నెంబర్లు ఏమంటే?
By: Tupaki Desk | 19 July 2020 6:12 AM GMTకారణం ఏమైతే కానీ లోక్ సభలో నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీటు మారింది. ఆయన పుణ్యమా అని పలువురు ఎంపీల సీట్ల నెంబర్లు మారిపోయాయి. ఇటీవల కాలంలో పార్టీ అధినాయకత్వానికి చిరాకు పుట్టించేలా వ్యవహరించటంలో సక్సెస్ అవుతున్న ఆయన.. అందుకు తగ్గట్లే పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకూ లోక్ సభలో నాలుగో వరుసలో కూర్చునే రఘురామ.. తాజాగా ఏడో వరుసకు షిఫ్ట్ కానున్నారు.
సింహం ఎక్కడ కూర్చున్నా అది సింహాసనమే అవుతుందంటూ తనను అభిమానించే వారు పెట్టిన పోస్టును ప్రస్తావిస్తున్న రఘురామ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. తన మీద వేటు వేయలేని అధినాయకత్వానికి ఉన్న ఇబ్బందిని గుర్తించిన ఆయన.. తన వ్యాఖ్యలతో ఉడికిస్తున్నారు. రఘురామ సీట్ ఛేంజ్ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీల సీట్లను మారుస్తూ.. పార్టీ నేత మిధున్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ను లేఖ ఇచ్చారు. దీంతో. వారి సీట్లకు సంబంధించి కొత్త నెంబర్లు కేటాయించారు.
ప్రస్తుతం నాలుగోవరుసలో 379 నెంబరు సీటును రఘురామ కృష్ణంరాజుకు కేటాయించగా.. తాజాగా ఆయన్న 445 సీటు నెంబరు కేటాయించారు. ఇప్పటివరకూ ఆ సీట్లో కూర్చున్న బెల్లానను పార్టీకి చెందిన ఎంపీ కోటగిరి శ్రీధర్ కూర్చునే 385 నెంబరు సీటును ఇచ్చారు. ఇక.. ఇప్పటివరకూ తాను కూర్చున్న సీటు స్థానే.. తాజాగా సీటు మార్చిన రఘురామ కృష్ణంరాజు కూర్చున్న సీటును ఇచ్చారు. మొత్తానికి రఘురామ సీటు మార్చటం కోసం మరో ముగ్గురు ఎంపీ సీట్లను మార్చాల్సి వచ్చిందన్న మాట. తాను ఎక్కడ కూర్చున్నా.. తన వాయిస్ తో తానేమిటో అందరికి అర్థమయ్యేలా చేస్తానన్న ధీమాతో రఘురామ ఉన్నారు. తాజాగా సీటు మార్చిన పార్టీ అధినాయకత్వం రానున్న రోజుల్లో మరెలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.