Begin typing your search above and press return to search.

వైసీపీ గేర్ ఛేంజ్- ఇక రెండేళ్ళూ జనంలోనేనా

By:  Tupaki Desk   |   8 March 2022 4:48 AM GMT
వైసీపీ గేర్ ఛేంజ్- ఇక రెండేళ్ళూ జనంలోనేనా
X
రాబోయే రెండేళ్ళూ మంత్రులు, ఎంఎల్ఏలంతా జనంలోనే ఉండాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. గడచిన మూడేళ్ళల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులను జనాలకు వివరించాలని ఆదేశించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో పిచ్చాపాటి మాట్లాడుతూ రాబోయే రెండేళ్ళ అజెండాను జగన్ ప్రకటించారు. ప్రతి మంత్రి, ఎంఎల్ఏ తన జిల్లాలో, నియోజకవర్గంలో రెగ్యులర్ గా పర్యటిస్తునే ఉండాలని ఆదేశించారు.

జిల్లాల పునర్వ్యవ్యస్ధీకరణ ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే దీనికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి అధికారులందరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్త జిల్లాల్లో పని చేస్తారని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని జనాలందరికీ మంత్రులు, ఎంఎల్ఏలు వివరించాలని జగన్ కోరారు. మంత్రులకు జగన్ చెప్పింది చూసిన తర్వాత తొందరలోనే రాబోయే ఎన్నికలకు పార్టీని జగన్ యాక్టివేట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది.

ఇప్పటికి కొందరు ప్రజా ప్రతినిధులు జనాల్లోకి పెద్దగా వెళ్ళటం లేదని జగన్ కు ఫిర్యాదులు అందాయి. అయితే మూడేళ్ల పాలనలో నియోజకవర్గంలో రెగ్యులర్ గా జనాలతో టచ్ లో ఉన్నది ఎవరు ? జనాలతో మమేకం అవుతున్నదెవరు ? అనే విషయాలను తనదైన మార్గాల్లో జగన్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. మంత్రుల పనితీరు విషయంలో కూడా జగన్ ఇదే పద్దతిలో ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. కాబట్టి ఎవరి పనితీరు ఏమిటనే విషయంలో జగన్ దగ్గర పూర్తి రిపోర్టుంది.

ఈ విషయాలను పక్కన పెట్టేసి మంత్రులు, ఎంఎల్ఏలు అందరు రాబోయే రెండేళ్ళు జనాల్లోనే ఉండాలని ఆదేశించటానికి కారణమిదే. తొందరలోనే వైఎస్సార్ ఎల్పీ సమావేశం నిర్వహించబోతున్నట్లు కూడా చెప్పారు. ఆ సమావేశంలోనే ఎంఎల్ఏలకు తాను దిశా నిర్దేశం చేయబోతున్నట్లు కూడా మంత్రులకు స్పష్టంగా చెప్పారు.

జగన్ ఆదేశాలు చూస్తుంటే తన మాట ప్రకారం జనాలతో మమేకం అవుతున్నదెవరు ? కానిదెవరు అనే విషయాలపైన కూడా ఫీడ్ బ్యాక్ తెప్పించుకోబోతున్నట్లు అర్ధమవుతోంది. కాబట్టి జగన్ ఆదేశాలను ఎంతమంది పాటిస్తారనేది తొందరలోనే తేలిపోతుంది.