Begin typing your search above and press return to search.
రెండు అవిశ్వాసాలూ ఒకటి కాదు సుమా
By: Tupaki Desk | 15 March 2016 6:14 AM GMTఏపీ సర్కారు మీద అవిశ్వాసాన్ని పెట్టిన ఏపీ విపక్షం.. తాజాగా ఏపీ స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టటం తెలిసిందే. పేరుకు అవిశ్వాసమే అయినా.. ఈ రెండింటి విషయంలో ఓ పెద్ద తేడా ఉంటుంది. ప్రభుత్వం మీద పెట్టే అవిశ్వాసానికి పది మంది విపక్ష సభ్యులు అవిశ్వాస నోటీసు మీద సంతకం పెడితే సరిపోతుంది. కానీ.. స్పీకర్ మీద పెట్టే అవిశ్వాసానికి అది సరిపోదు.
స్పీకర్ మీద పెట్టే అవిశ్వాస నోటీసు మీద 50 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం మీద పెట్టే అవిశ్వాస నోటీతో పోలిస్తే.. స్పీకర్ మీద పెట్టే అవిశ్వాస నోటీసుకు ఎక్కువమంది సభ్యులు సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే.. నోటీసును పరిగణలోకి తీసుకుంటారు. పేరుకు అవిశ్వాసమే అయినా.. రెండింటి మధ్య వ్యత్యాసం మాత్రం ఎక్కువేనని చెప్పాలి.