Begin typing your search above and press return to search.
స్పీకర్‌పై అవిశ్వాసం?
By: Tupaki Desk | 19 March 2015 10:02 AM GMTఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ భావిస్తోంది. బహుశా శుక్రవారమే దీనికి సంబంధించిన నోటీసు ఇచ్చేలా పావులు కదుపుతోంది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంతో ప్రతిపక్షం కూడా లబ్ధి పొందేది పెద్దగా ఏమీ ఉండదు. కానీ, అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే స్పీకర్‌పై అవిశ్వాసం ద్వారా ఆయన పరువు మాత్రం గంగలో కలుస్తుంది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌కు దీటుగా ఉండాలనే ఉద్దేశంతో నరసరావుపేటకు చెందిన కోడెల శివప్రసాదరావును స్పీకర్‌ను చేసిన సంగతి తెలిసిందే. నరసరావుపేట డివిజన్లో కమ్మ రెడ్డి వర్గాల పోరు అందరికీ తెలిసిందే. అక్కడ కోడెల ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే.. మరో వర్గానికి మరొకరు. ఇది దశాబ్దాల పోరు అన్న విషయం కూడా తెలిసిందే. అయితే, ఫ్యాక్షనిస్టు ముద్ర ఉన్న జగన్‌కు ఆయన అయితేనే సరిగ్గా సరిపోతారనే అభిప్రాయంతోనే టీడీపీ ఆయనను ఎంపిక చేసింది. అయితే, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజు నుంచీ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తూనే ఉంది. నిజానికి ఆయననే టార్గెట్‌గా చేసుకుంది కూడా. గత సమావేశాల్లోనే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా భావించింది. అయితే, సీనియర్లు వద్దని చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గింది.
ఇప్పుడు మాత్రం ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో జగన్ లేరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో మాట్లాడడానికి లేచిన వెంటనే అధికార పక్ష సభ్యులు రన్నింగ్ కామెంటరీ, వ్యక్తిగత దూషణలు, తనకు మాట్లాడే అవకాశం రాకపోవడం.. వచ్చినా మధ్యలో అధికార పక్ష సభ్యులు అడ్డుకోవడం.. వీటిని స్పీకర్ నిరోధించలేకపోవడమే కాకుండా ఆయన అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారనే ముద్ర జగన్‌లో బాగా పడిపోయిందని, ఈసారి అవిశ్వాస తీర్మానం పెట్టి తీరాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై శుక్రవారానికి ఒక స్పష్టత రానుంది.
అసెంబ్లీలో బలం లేని ప్రతిపక్షం స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టినందువల్ల ఏమీ జరగదు. స్పీకర్ పదవి పోదు. అధికార పక్షం బలంతో ప్రతిపక్ష తీర్మానం వీగిపోతుంది. కానీ, స్పీకర్ కోడెల పరువు మాత్రం గంగలో కలుస్తుంది. పదవిని చేపట్టిన తొమ్మిది నెలల్లోనే అవిశ్వాస తీర్మానం ఆయనకు శోభను చేకూర్చదు.