Begin typing your search above and press return to search.

క‌మ్యూనిస్టులు - వైసీపీ .. ఓ గ్రేట‌ర్ పోరు

By:  Tupaki Desk   |   19 Nov 2020 5:30 PM GMT
క‌మ్యూనిస్టులు - వైసీపీ .. ఓ గ్రేట‌ర్ పోరు
X
తెలంగాణ‌లోని అన్ని ప్ర‌ధాన పార్టీలు ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌యేందుకు అతి త‌క్కువ స‌మ‌యం ఉండ‌టంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితాలోకి క‌మ్యూనిస్టు పార్టీలు కూడా చేరాయి. ఈద‌ఫా రెండు ప్ర‌ధాన క‌మ్యూనిస్టు పార్టీలు పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి. ఆ ప్రధాన పార్టీలే సీపీఐ , సీపీఎం .

సీపీఐ , సీపీఎం లు 15 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేశాయి. సీపీఐ తరపున 8 మంది, సీపీఎం తరపున ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు. తాజా జాబితాతో మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్‌ లో ఇప్పటి వరకు సీపీఐ... సీపీఎం కలిపి 26 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాగా, వామ‌ప‌క్షాల బ‌లం ఇంత త‌క్కువ స్థాయికి ప‌డిపోయిందా అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

కాగా, గ్రేటర్ ఎన్నికలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి గ్రేటర్‌ ఎన్నికల్లో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయడం లేదంటూ ప్రకటన విడుదల చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గ‌మ‌నించాల‌న్నారు.