Begin typing your search above and press return to search.
ఎన్టీయార్ తో పెట్టుకోవద్దు సామీ
By: Tupaki Desk | 21 Sep 2022 7:30 AM GMTఎన్టీయార్ కి రాజకీయాలు తెలియవు. ప్రజల గురించి మాత్రమే తెలుసు. ఎన్టీయార్ సినీ రంగం నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాలనానుభవం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. అయినా సరే అద్భుతంగా పాలించారు. ఆయన పుస్తకాలలో నిబంధనలను చూసి పనిచేయలేదు. మనసు పెట్టి ఆలోచించి చట్టాలు చేశారు. అందుకే ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకు వచ్చాయి.
పేదవాడిని కావాల్సిన కూడు గూడు గుడ్డ అన్నది ఎన్టీయార్ నినాదం, అదే ఆయన పాలనా విధానం. ఇక ఎన్టీయార్ టైం లో అనేక విద్యా సంస్థలు వచ్చారు. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఎన్టీయార్ విజయవాడలో నాడు అంటే ఇప్పటికి ముప్పయారేళ్ళ క్రితం 1986లో ఎన్టీయార్ వైద్య అరోగ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది విప్లవాత్మకమైన చర్యగా నాడు నేడూ అంతా కొనియాడుతారు.
అలాంటి ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం పేరుని మార్చాలనుకోవడం తప్పున్నర తప్పు. వైఎస్సార్ కూడా ఉమ్మడి ఏపీకి ఎంతో చేశారు. ఆయన పేరిట జిల్లా ఉంది. అవసరం అయితే వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏమైనా నిర్మాణాలకు ఆయన పేరు పెట్టుకోవచ్చు. కానీ ఉన్న పేరుని, అందునా తెలుగు వల్లభుడిగా కీర్తిని అందుకుని ఇటు సినీ రంగాన అటు రాజకీయ రంగాన తన విఖ్యాతిని చాటుకున్న ఎన్టీయార్ పేరుని తొలగించాలనుకోవడం దారుణం.
ఎన్టీయార్ అభిమానులలో ఎక్కువ మంది ఆనాడు వైఎస్సార్ కి మద్దతుగా నిలిచారు. వారు ఇపుడు జగన్ వెంట ఉన్నారు. ఆ విధంగా వైసీపీ ఇద్దరు మహానుభావుల అభిమానుల మద్దతుని సాధించింది. క్రిష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడితే అంతా సంతోషించారు. జగన్ గ్రేట్ అన్నారు. ఆయన చేతుల మీదుగా భారత రత్న కూడా ఎన్టీయార్ కి వచ్చేలా చూడాలని కోరుకున్నారు.
అదే జగన్ ఇపుడు ఎన్టీయార్ హెల్త్ వర్శిటీ పేరుని తొలగిస్తామంటే ఎన్టీయార్ అభిమానులు ఎవరూ ఊరుకోరు. ఇక్కడ టీడీపీకి రాజకీయాలకు సంబంధం లేకుండా ఎన్టీయార్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తన కుటుంబ సభ్యుడిగా అంతా చూసుకుంటారు. ఎన్టీయార్ కి ఏ పార్టీ రాజకీయ ముద్ర కూడా ఎవరూ అంటగట్టలేరు. కానీ జగన్ సర్కార్ మాత్రం తొందరపాటో పొరపాటో కానీ తప్పుడు నిర్ణయమే తీసుకుటోంది అని అంటున్నారు.
ఎన్టీయార్ అంటే తనకు అభిమానం అని జగన్ అసెంబ్లీలో చెప్పుకోవడం కాదు, ఆయన పేరుని తొలగించిన తరువాత ఆయన ఎన్ని మాటలు చెప్పినా కూడా అది వైసీపీకి ఆయనకు కూడా రాజకీయంగా భారీ నష్టం చేకూరుస్తుంది. చంద్రబాబుతో జగన్ పెట్టుకుని సీఎం అవగలిగారు కానీ ఎన్టీయార్ తో పెట్టుకుంటే మాత్రం ఆయన రాజకీయంగా చిక్కుల్లో పడడం ఖాయమని అంతా అంటున్నారు. ఎన్టీయార్ కి చంద్రబాబు తీరని అన్యాయం చేశారనే ఆయన వైపు పూర్తిగా ఎన్టీయార్ ఫ్యాన్స్ ఎవరూ రాలేదు.
ఇక్కడ మరో మాట ఉంది. దివంగత నేత వైఎస్సార్ ఎన్టీయార్ ఫ్యాన్. ఆ సంగతి ఆయనే అప్పట్లో చెప్పుకున్నారు. ఇక ఎన్టీయార్ మానసపుత్రిక అయిన తెలుగు గంగకు వైఎస్సార్ ఆయన పేరు జోడించి ఎన్టీయార్ తెలుగుగంగ అని కొత్తగా నామకరణం చేశారు. అలాంటి వైఎస్సార్ ని కూడా అవమానించేలా ఎన్టీయార్ పేరుని తీసేసి ఆయనకు పెట్టడం వైఎస్సార్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేరు.
అన్ని విషయాల్లో దూకుడు పనికిరాదు. అర్ధరాత్రి బిల్లు తయారు చేసి తెల్లారి సభలో బలం ఉంది కదా అని పేరు మార్చి చట్టం చేస్తే అక్కడ చెల్లుతుందేమో కానీ బయట మాత్రం వైసీపీని ఏపీ మొత్తం కాదు యావత్తు తెలుగు వారంతా వ్యతిరేకిస్తారు అని గుర్తుంచుకోవాలి అని అంటున్నారు.
అంతవరకూ ఎందుకు వైసీపీలో ఉన్నవారే ఈ నిర్ణయం తప్పు అంటున్నారు. మరి వైసీపీ తెలిసి చేస్తున్నదో ఏమో కానీ ఈ తప్పుని దిద్దుకోకపోతే మాత్రం రాజకీయంగానే కాదు అన్ని రకాలుగా వైసీపీ ఇబ్బందిలో పడుతుంది అన్న సూచనలు హెచ్చరికలు అయితే అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.