Begin typing your search above and press return to search.

ఆ మంత్రి అంతే.. మార‌రు.. రాసిపెట్టుకున్న వైసీపీ!!

By:  Tupaki Desk   |   31 Aug 2022 10:30 AM GMT
ఆ మంత్రి అంతే.. మార‌రు.. రాసిపెట్టుకున్న వైసీపీ!!
X
అదేంటో కానీ.. వైసీపీలో కొంద‌రు నాయ‌కులు మార‌డం లేదు. ఒక‌వైపు పార్టీ అధి నాయ‌కుడు మీరు మారా లి.. మీరు మారాలి.. అని నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. అయినా.. కూడా కొంద‌రు నాయ‌కులు మాత్రం తమ ప‌ద్ధ‌తుల‌ను మార్చుకునేందుకుఏమాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో 'ఇక‌, వీరు ఇంతే.. మార‌రు..!' అనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. జ‌గ‌న్ త‌న తొలి మంత్రివ‌ర్గం లో ఉన్న‌వారిలో చాలా మందిని పక్క‌న పెట్టారు. వీరిలో ఫైర్‌బ్రాండ్‌లు కూడా ఉన్నారు.

అప్ప‌టికే పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తూ.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డిన నాయ‌కులు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ వారికి రెండో ద‌ఫా అవ‌కాశం ఇవ్వ‌లేదు. కానీ, అప్ప‌టికే కొన్ని అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న క‌ర్నూలు జిల్లాకు చెందిన నాయ‌కుడు.. గుమ్మ‌నూరు జ‌య‌రాం కుమాత్రం జ‌గ‌న్ రెండోసారి త‌న మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. వాస్త‌వానికి అప్ప‌టికే ఆయ‌న‌పై.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

గుమ్మ‌నూరు కుమారుడు.. ఒక డీల్‌లో తండ్రి అధికారాన్ని వినియోగించి.. ఆడి కారును లంచంగా తీసుకు న్నార‌ని.. అయ్య‌న్న విమ‌ర్శించ‌డం.. ఏడాది కింద‌ట‌.. రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ఎంత వివాదం చెల‌రేగినా.. జ‌గ‌న్ కానీ.. వైసీపీ నాయ‌కులు కానీ.. స్పందించ‌లేదు. ఇదిలావుంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో.. గుమ్మ‌నూరుకు మ‌రోసారి జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. మ‌రి ఇలా ఎందుకు ఇచ్చారో తెలియ‌దుకానీ.. గుమ్మ‌నూరుకు మాత్రం.. మంచి ఛాన్సే ద‌క్కింది.

అయితే.. ఆయ‌న రెండో సారి మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. కూడా ప‌రిస్థితిని మార్చుకునే ప్ర‌య త్నం చేయ‌డం లేద‌ని.. క‌ర్నూలు టాక్‌. ''ఎక్క‌డా కూడా ఆయ‌న క‌నిపించ‌రు. వాయిస్ కూడా వినిపించ దు.

కానీ, ఆయ‌న కుమారుడు మాత్రం అంతా చ‌క్క‌బెడుతున్నారు. మేం పార్టీలో ఉంటూ.. గుమ్మ‌నూరు గెలుపు కోసం ప్ర‌య‌త్నించాం. కానీ, ఇప్పుడు మా ముఖం చూసేందుకు కూడా ఆయ‌న ఇష్ట‌ప‌డడం లేదు'' అని కొంద‌రు గుమ్మ‌నూరు అనుచ‌రులు.. సోష‌ల్ మీడియాలో పెడుతున్న వ్యాఖ్య‌లు సంచ‌లనం గా మారాయి.

దీనికితోడు ప్ర‌జ‌ల మ‌ధ్య ఆయ‌న ఉండ‌డం లేదు. శాఖాప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌పైనా.. ఆయ‌న‌కు అవ‌గాహ‌న లేద‌ని..సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇలా.. ఏవిధంగా చూసుకున్నా.. గుమ్మ‌నూ రు కేవ‌లం లెక్క‌కోసం.. మంత్రి అయ్యార‌ని.. ఆయ‌న ప‌నితీరును అంచ‌నా వేద్దామ‌న్నా.. ఎక్క‌డా ఏమీ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు నాయ‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.