Begin typing your search above and press return to search.

ఎక్కే మెట్టు దిగే మెట్టు.. ఆ వైసీపీ నేత‌ల‌ను చూస్తే జాలేస్తోందా...!

By:  Tupaki Desk   |   30 March 2022 1:30 AM GMT
ఎక్కే మెట్టు దిగే మెట్టు.. ఆ వైసీపీ నేత‌ల‌ను చూస్తే జాలేస్తోందా...!
X
వైసీపీలోని ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఒక విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ``వాళ్ల‌ను చూస్తే.. జాలేస్తోంది సార్‌. మ‌న సార్ ఏమీ తేల్చ‌డు!`` అంటూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే.. నెల్లూరు జిల్లాకు చెందిన మ‌రో ఎమ్మెల్యేతో చెప్ప‌డం.. మీడియా చెవిన ప‌డింది. దీంతో ఏంటి సార్ ఏంటి సార్‌.. మీడియా మిత్రులు ఒక‌రిద్ద‌రు.. అడిగారు. అయితే.. ఎప్ప‌టికో కానీ.. విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసేందుకు అసెంబ్లీకి వ‌చ్చారు.

వారు.. ఎక్కే మెట్లు దిగే మెట్లు త‌ప్ప‌.. సీఎం మాత్రం వారికి అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. వాస్త‌వానికి అసెంబ్లీ జ‌రుగుతున్న స‌మ‌యంలో సీఎంను క‌లుసుకునేందుకు పెద్ద‌గా అప్పాయింట్‌మెంట్ కూడా అవ‌స‌రం లేదు. ఆయ‌న స‌భ‌లోకి వెళ్లే స‌మ‌యంలో క‌లిసి ఒక‌టి రెండు నిముషాలు చాలా మంది మాట్లాడుతుంటారు. ఇలానే అనుకుని.. ఒక‌రు హైద‌రాబాద్ నుంచి మ‌రొక‌రు క‌ర్నూలు నుంచి వ‌చ్చారు. వీరిద్ద‌రూ కూడా పార్టీలో ప్ర‌ముఖులు. అయితే.. సీఎం జ‌గన్ మాత్రం వీరికి అవ‌కాశం ఇవ్వ‌లేద‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. వారు రాజ్య‌స‌భ స్థానాల‌ను ఆశిస్తున్నార‌ట‌.

ఇదే విష‌యం చిత్తూరుకు చెందిన ఎమ్మెల్యే ప్ర‌ధానంగా ప్ర‌స్తావించార‌ట‌. వారిని తిప్ప‌డం.. వారేమో.. సీఎం ద‌గ్గ‌ర‌కు రావాల‌ని ప్ర‌య‌త్నం చేయ‌డం.. రాలేక పోవ‌డం. స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగం అయ్యేవ‌ర‌కు బ‌య‌టే వేచి ఉండ‌డం.. అంతా కూడా.. వీరి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది. వీరే.. ఒక‌రు పీవీపీ అయితే.. మ‌రొక‌రు బుట్టారేణుక‌. వీరిద్ద‌రూకూడా రాజ్య‌స‌భ సీటును ఆశిస్తున్నారు. గ‌తంలోనే త‌మ‌కు ఛాన్స్ కావాల‌ని ఆశించార‌ట‌. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వారిని జ‌గ‌న్ క‌రుణించ‌లేదు. త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌సీట్లు ఖాళీ అవుతున్న నేప‌థ్యంలో మ‌రోసారి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే.. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఏమీ తేల్చ‌డం లేద‌నేది వారి వాద‌న‌. నిజానికి బుట్టారేణుక ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఆమెకు.. ఎమ్మెల్సీ ఇవ్వ‌వ‌చ్చ‌ని .. అంటున్నారు. త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో బీసీ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వొచ్చ‌ని అంటున్నారు. ఇక‌, పీవీపీ జ‌గ‌న్‌కు చాలా మిత్రుడు. పైగా అక్కినేని నాగార్జున‌కు కూడా ఆయ‌న మిత్రుడు. అయినా.. కూడా ఆయ‌న విష‌యం తేల్చ‌క‌పోవ‌డ‌మే.. వైసీపీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. మ‌రి వీరికి ఎప్ప‌టికి మోక్షం ల‌భిస్తుందో చూడాలి.