Begin typing your search above and press return to search.
‘కారు’లో అధికారిక భాగంగా పిల్ల కాంగ్రెస్
By: Tupaki Desk | 6 May 2016 4:30 PM GMTచేతిలో పవర్ ఉండాలే కానీ.. అనుకున్నవి అనుకున్నట్లే జరిగిపోవటం మామూలేనన్న విషయం మరోసారి నిరూపితమైంది. తెలంగాణ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఒక ఆంధ్రా పార్టీ దుకాణాన్ని బంద్ చేయించాలన్న ఆలోచనలో పావులు కదిపిన కేసీఆర్ అండ్ కో తాను అనుకున్న పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎంపీ.. ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందటం తెలిసిందే.
వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలోనే కారు ఎక్కేయగా.. తాజాగా ఎంపీ పొంగులేటి.. ఎమ్మెల్యే పాయం కారు ఎక్కేయటం తెలిసిందే. వీరిద్దరి పోకతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ మిగల్లేదు. పార్టీని తెలంగాణ అధికారపక్షంలో విలీనం చేస్తూ.. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి అభ్యర్థనపై తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పిల్ల కాంగ్రెస్ గా పిలుచుకునే వైఎస్సార్ కాంగ్రెస్ ను టీఆర్ ఎస్ లో విలీనం చేసినట్లుగా ప్రకటిస్తూ అధికారిక బులిటెన్ ను విడుదల చేశారు.
తాజాగా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ చాఫ్టర్ ముగిసినట్లైంది. ఒక ఆంధ్రా పార్టీని తెలంగాణలో కనుమరుగు చేశామంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పిన మాటకు తగ్గట్లే తాజా పరిణామం చోటు చేసుకుందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీ తెలంగాణ అధికారపక్షంలో విలీనమైన సందర్భంలో అయినా.. వైఎస్ జగన్ ఈ అంశంపై గళం విప్పుతారా?