Begin typing your search above and press return to search.

రామకృష్ణారెడ్డి హ‌త్య‌.. వైసీపీ కూసాలు క‌దులుతున్నాయా?

By:  Tupaki Desk   |   11 Oct 2022 5:46 AM GMT
రామకృష్ణారెడ్డి హ‌త్య‌.. వైసీపీ కూసాలు క‌దులుతున్నాయా?
X
పార్టీ ఎద‌గాలంటే.. నాయ‌కులు అవ‌స‌రం. అలాంటి నాయ‌కుల‌కు ఏదైనా క‌ష్టం వ‌స్తే.. మేమున్నామ‌నే భ‌రోసా అవ‌స‌రం. ఇది లేక‌పోతే.. పార్టీ ఎంత పెద్ద‌గా ఉన్నా.. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వీక్ కావ‌డం త‌థ్యం. ఇప్పుడు వైసీపీలో ఇదే జ‌రుగుతోంది. అధికారంలో ఉండి.. 151 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉండి త‌మ‌కు తిరుగులేద‌ని భావిస్తున్న వైసీపీకి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాయ‌కులు.. పార్టీ అభిమానుల బ‌లం బ‌ల‌గం రెండూ అవ‌స‌రమే. ఈ విష‌యంలో తేడా వ‌స్తే.. పార్టీ పుట్టిమున‌గ‌డం ఖాయం.

ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. హిందూపురంలో తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. వైసీపీలో కీల‌క నాయ‌కుడు.. హిందూపురంలో పార్టీని బ‌లోపేతం చేస్తున్న చౌళూరు రామ‌కృష్నారెడ్డి అత్యంత దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ హ‌త్య వెనుక‌.. ఎమ్మెల్సీ.. మాజీ పోలీసు అధికారి.. ఇక్బాల్ స‌హా ఆయ‌న అనుచ‌రుడు ఉన్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ స‌మ‌యంలో పార్టీ అధిష్టానం ప‌ట్టించుకుని.. అస‌లు ఏం జ‌రిగింది? పార్టీలో ఎందుకు ఇంత‌గా అంత‌ర్గ‌త క‌ల‌హాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌నే విష‌యాన్ని తెలుసుకుని ఉంటే బాగుండేది.

కానీ, ఇవేవీ చేయ‌క‌పోగా.. క‌నీసం.. రామ‌కృష్ణారెడ్డి మృత‌దేహాన్ని సంద‌ర్శించి. నివాళుల‌ర్పించేందుకు కూడా స‌మ‌యం ఇవ్వ‌లేదు. సీఎం జ‌గ‌న్ వెళ్ల‌క‌పోయినా.. ఆయ‌న త‌ర‌పున కీల‌క నేత‌ల‌ను అయినా.. పంపించి ఉండాల్సింది. కానీ, అలా నూ చేయ‌లేదు. కేవ‌లం లోక‌ల్ లీడ‌ర్స్ కొంద‌రు వెళ్లి.. మ‌మ అనిపించి వ‌చ్చారు. మ‌రోవైపు రామ‌కృష్ణారెడ్డి మాతృమూర్తి మాత్రం.. ఈ హ‌త్య వెనుక‌.. సొంత పార్టీ నేత‌లే ఉన్నార‌ని.. ఆరోపించారు. ఈ క్ర‌మంలో పార్టీలో ఒక విధంమైన‌.. ఆత్మ‌న్యూన‌తా భావం ఏర్ప‌డుతోంది.

ఇప్ప‌టికే.. కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. త‌మ‌ను ప‌క్క‌న పెట్టార‌నే భావ‌న రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఉంది. ఇప్పుడు హ‌త్య‌కు గురైంది కూడా.. రెడ్డి నేతే. సో.. దీంతో రెడ్డి వ‌ర్గం.. మ‌రింత‌గా ర‌గిలిపోతోంది. తాము పార్టీ జెండా మోసి.. సీఎంగా జ‌గ‌న్‌ను చూడాల‌ని అనుకుంటే.. క‌నీసం త‌మ బాగోగుల‌ను కూడా.. ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. రెడ్డి నేత‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఈ ప‌రిణామం.. పార్టీలోనూ.. చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇది ముదిరితే.. సీఎం జ‌గ‌న్ కే అంతిమంగా తీవ్ర‌మైన దెబ్బ త‌గులుతుంద‌ని అంటున్నారు.

ప్ర‌తిపక్షం టీడీపీ.. త‌న పార్టీకి చెందిన వార్డు స‌భ్యుడు సాధార‌ణ స్థితిలో చ‌నిపోయినా.. కుటుంబాన్ని ప‌రా మర్శిస్తోంది. మేమున్నామ‌నే భ‌రోసా ఇస్తోంది. మ‌రి అలాంటిది.. అధికారంలో ఉన్న పార్టీ కీల‌క నేత హ‌త్య‌కు గురైనా.. ప‌ట్టించుకోలేదంటే.. ఇక్బాల్‌కే ప్రాధాన్యం ఇస్తోంద‌నే సంకేతాలు పంపిన‌ట్టు అయింది.

దీనిని రెడ్డి వ‌ర్గం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. ''మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు. ఎందుకు కాడి మోయాలి'' అని క‌నుక రెడ్డి వ‌ర్గం అనుకుంటే.. జ‌గ‌న్ పెట్ట‌కున్న 175కు 175 కాదు క‌దా.. ఉత్త 75 సీట్ల‌లో కూడా విజ‌యం క‌ష్ట‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.