Begin typing your search above and press return to search.

అటు అరవై...ఇటు డజన్ : అదనపు భారంతో వైసీపీ విలవిల...?

By:  Tupaki Desk   |   24 Aug 2022 12:30 AM GMT
అటు అరవై...ఇటు డజన్ : అదనపు భారంతో వైసీపీ విలవిల...?
X
పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి. ఇది అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఎత్తుగడ. దాని కోసం ఆయన రెండేళ్ళ ముందు నుంచే మేలుకున్నారు. నానా హైరానా పడుతున్నారు. పార్టీకి పేరుంది. తన పట్ల సానుకూలత ఉంది. మరి ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. దాంతో ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. పనిచేయని వారికి షాకిచ్చేలా జగన్ డెసిషన్స్ ఉంటునాయని చెబుతున్నారు.

ఎన్నిసార్లు చెప్పినా మారని ఎమ్మెల్యేల విషయంలో ఇక కఠినంగా ఉండాలనే జగన్ ఆలోచిస్తున్నారుట. అందులో భాగంగానే గుంటూరు జిల్లా తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అదనపు భారాన్ని తగిలించారు. ఆమె ఉంటూండగానే అదనపు ఇంచార్జిని నియమించి జగన్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ని అలా నియమించి శ్రీదేవికి చెక్ పెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని పార్టీలో వినిపిస్తున్న మాట. కేవలం తాడికొండ మాత్రమే కాదు, ఏపీలో ఇలాంటి సీట్లు ఒక అరవై దాకా జగన్ దృష్టిలో ఉన్నాయట. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ పార్టీ లేని చోట ఇంచార్జిలు కానీ సరిగ్గా పనితీరు కనబరచలేకపోతున్నారు అన్న నివేదికలు జగన్ వద్ద ఉన్నాయట. అలాగే మరో డజన్ దాకా ఎంపీ సీట్లలో కూడా వారి పనితీరు బాలేదని రిపోర్టు వచ్చిందట.

దాంతో ఆ ప్లేస్ లలో వారికి అదనపు ఇంచార్జిలను అటాచ్ చేయడం ద్వారా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అలా కనుక చేస్తే సిట్టింగులు కానీ ప్రస్తుతం ఉన్న ఇంచార్జిలు కానీ అలెర్ట్ అవుతారని, తమ తీరు మార్చుకుని పరుగులు పెడతారని పార్టీ పెద్దలు భావిస్తున్నారుట. అలా కాకుండా అదనపు బాధ్యులే స్పీడ్ అందుకుంటే ఎలాంటి మొహమాటం లేకుండా వారికే టికెట్లు కంఫర్మ్ చేయవచ్చు అని కూడా తెలుస్తోంది.

ఈ విధంగా చూస్తే రాయలసీమ నుంచి కోస్తా ఉత్తరాంధ్రా జిల్లాల దాకా చాలా చోట్ల మహా ముదుర్లు అనుకున్న వారి సీట్లలోనే అదనపు బాధ్య్లు రాబోతున్నారు అని అంటున్నారు. అంటే వారంతా పనిచేయనట్లే అన్న నివేదికలు జగన్ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఇలా లెక్క తీస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ, బాపట్ల, వేమూరు ఉన్నాయి. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు, పర్చూరు, కొండపి, మార్కాపురం, యర్రగొండపాలెం ఉన్నాయని చెబుతున్నారు.

అదే విధంగా నెల్లూరులో చూసుకుంటే కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు, వెంకటగిరి ఉండగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలొ , పూతలపట్టు, పలమనేరు, శ్రీకాళహస్తి, గూడూరు ఉన్నాయని టాక్. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఎచ్చెర్ల, పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం ఉన్నాయి. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూస్తే కురుపాం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం సీట్లు ఉన్నాయని అంటున్నారు.

ఇక ఉమ్మడి విశాఖ జిల్లా చూస్తే విశాఖ ఈస్ట్, సౌత్, పాయకరావుపేట, నర్సీపట్నం, అరకు, గాజువాక, పిఠాపురం, పాడేరు ఉన్నాయి అలాగే ఉభయ గోదావరి జిల్లాలు చూస్తే జగ్గంపేట,ప్రత్తిపాడు, రాజమండ్రి సిటీ, రూరల్, కాకినాడ రూరల్, రంపచోడవరం, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు, పెనమలూరు ఉన్నయి. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమతో పాటు, మైలవరం, కైకలూరు, అవనిగడ్డ ఉన్నాయి. అలగే రాయలసీమ జిల్లాలు చూస్తే కనూ శింగనమల, పత్తికొండ, హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం, కళ్యాణదుర్గం, నందికొట్కూరు, మైదుకూరు అసెంబ్లీ సీట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

దాంతో ఇక్కడ కొత్త వారిని సమర్ధులను అదనపు ఇంచార్జులుగా పెట్టి పార్టీ బండిని నడిపించాలని చూస్తున్నారు. వీరిలో ఎవరు బాగా పనిచేస్తే వారికే టికెట్ ఇస్తారని కూడా చెబుతున్నారు. ఇదే ఫార్ములాను ఏపీలో ఉన్న 12 ఎంపీ సీట్లలో కూడా వర్తింపచేయబోతున్నారుట. ఆ సీట్లు చూస్తే హిందూపురం, అనంతపురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, నరసాపురం, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం అని చెబుతున్నారు. అక్కడ సిట్టింగులతో పాటు ఇంచార్జిలు మరింత దూకుడు పెంచాలని సంకేతలు ఇచ్చేలా అదనపు ఇంచార్జుల నియామకం ఉండనుంది అంటున్నారు.

అంటే పాతవారితో పాటు కొత్తవారు రంగంలోకి దిగుతారు అన్న మాట. మరి పాతవారు ఏం చేస్తారు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. తమ సీటుకు పోటీ పెట్టి పనిచేయమంటే చేస్తారా అన్నది కూడా ఉంది. అయితే జగన్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి తమ పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అదే టైమ్ లో తాము బాగా పనిచేసినా కొత్త మోజులో అదనపు ఇంచార్జిలకే టికెట్లు ఇస్తే తమ సంగతేమిటి అన్న బెంగ కూడా వారిలో ఉంది. దాంతోనే ఇది ఆరోగ్యకరమైన పోటీకి దారితీస్తుందా లేక వర్గ పోరునకు దారి తీస్తుందా అన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది. మొత్తానికి పార్టీని గాడిన పెట్టడానికే ఇదంతా అని వినిపిస్తున్న మాట.