Begin typing your search above and press return to search.

అప్పులు చేసి పంచుతున్నాం.. ఆ మాత్రం గెల‌వ‌లేమా? వైసీపీ ప్లీన‌రీ వ్యూహం!

By:  Tupaki Desk   |   7 July 2022 11:30 PM GMT
అప్పులు చేసి పంచుతున్నాం.. ఆ మాత్రం గెల‌వ‌లేమా? వైసీపీ ప్లీన‌రీ వ్యూహం!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహం ఏంటి? దివంగ‌త వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని గుంటూరు వేది కగా నిర్వ‌హించ‌నున్న ప్లీన‌రీలో ఎలాంటి అంశాల‌ను అజెండాగా తీసుకుంది? అనే విష‌యాలు ఆస‌క్తి రేపు తున్నాయి. నేత‌లు చెబుతున్న దానిని బ‌ట్టి.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడేళ్ల పాల‌న‌పైనే ప్లీన‌రీ దృష్టి పె ట్ట నుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ‌త మూడేళ్ల పాల‌న‌లో తాము ఏం చేశారు.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన సం క్షేమ నిధులు.. ఇలాంటి వాటిని ఏక‌రువు పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

అయితే.. దాదాపు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీలో ఏపీలో వైసీపీ మ‌రింత దూకు డు చూపేందుకు.. అవ‌స‌ర‌మైన విధానాల‌ను వైసీపీ అధినేత హోదాలో జ‌గ‌న్ త‌ప్ప‌కుండా ఆవిష్క‌రిస్తా రని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో 175 స్థానాల‌ను ఎందుకు గెలుచుకోలేమంటూ.. ఆయ‌న స్వ‌యంగా నేత‌ల‌కు నూరిపోశారు. కొంచెం క‌ష్ట‌ప‌డితే.. విజ‌యం మ‌న‌ను వ‌రిస్తుంద‌ని కూడా జ‌గ‌న్ చెప్పా రు. అయితే.. దీనికి ఎంత మంది మొగ్గు చూపుతున్నారు? ఎంత మంది ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీలో ఈ విష‌యం ప్ర‌ధాన అజెండాగా ఉంటుంద‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో తాము ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌కుండానే 151 సీట్లు సాధించిన‌ప్పుడు.. ఇప్పు డు అప్పులు చేసి మ‌రీ ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నందున‌.. పూర్తిస్తాయిలో సీట్ల‌ను ఎందుకు కైవసం చేసుకోలేమ‌న్న‌ది వైసీపీ అధినేత‌గా సీఎం ఆలోచ‌న‌. పైగా.. స్థానిక‌, జ‌డ్పీ... కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో వైసీపీనే గెలిచినందున.. రాష్ట్ర వ్యాప్తంగా ఎందెందు వెదికినా.. త‌మ నేత‌లే క‌నిపిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. 175 సీట్ల టార్గెట్‌ను ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌ధానంగా వినిపించ‌నున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను జాగ్ర‌త్త‌గా ముందుకు తీసుకువెళ్తే.. త‌ర్వ‌త త‌న‌కు ఇబ్బంది లేద‌న్న‌ది .. జ‌గ‌న్ ఆలోచ‌న‌గా ఉంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగా 150 కే టికెట్లు ప‌రిమితం అయితే.. మాత్రం ప‌రి స్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంద‌ని, అందుకే.. టార్గెట్ 175 తో ముందుకు సాగేలా.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మ‌రోవైపు.. ప్లీన‌రీకి భారీ సంఖ్య‌ల‌లోనాయ‌కులు వ‌స్తార‌ని అంటున్నా.. వ‌చ్చే దాకా సందేహ‌మేన‌ని తెలుస్తోంది.