Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల్లో నేత‌ల దూకుడేదీ? వైసీపీలో మ‌రో చ‌ర్చ‌...!

By:  Tupaki Desk   |   11 Nov 2022 3:58 AM GMT
కొత్త జిల్లాల్లో నేత‌ల దూకుడేదీ? వైసీపీలో మ‌రో చ‌ర్చ‌...!
X
వైసీపీ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌ను ప్ర‌క‌టించింది. 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్వ‌రూపాన్ని మారు స్తూ.. నేత‌లు.. ప్ర‌జ‌ల అభిప్రాయాల మేర‌కు మ‌రో 13 జిల్లాల‌ను ఏర్పాటు చేసింది.దీనిపై అనేక వివా దాలు కూడా వ‌చ్చాయి.

అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ ప్ర‌భుత్వం ముందుకే వెళ్లింది. ఏ ప్ర‌భుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. ఏం చేసినా.. దాని వెనుక రాజ‌కీయకార‌ణాలే ఎక్కువ‌గా ఉంటాయి. సో.. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఈ జిల్లాల ఏర్పాటు కూడా అంతే!

కొత్త జిల్లాల ఏర్పాటుతో పార్టీకి మ‌రింత క్రేజ్ పెరుగుతుంద‌ని వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ లెక్క‌లు వేసుకున్నారు. అందుకే.. ఏమీ ఆలోచ‌న చేయ‌కుండానే వెన‌క్కి కూడా త‌గ్గ‌కుండానే జిల్లాల‌ను ఏర్పాటు చేశారు. ఇది సంచ‌ల‌న నిర్ణ‌య‌మే. అయితే, దీనిని పార్టీకి, ప్ర‌భుత్వానికి ఏమేర‌కు అనుకూలంగా మార్చుకున్నార‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న కీల‌క విష‌యం. ఎందుకంటే.. కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాల్లో పార్టీ దూకుడు క‌నిపించ‌డం లేదు.

ఎప్పుడూ.. చేసే రాజ‌కీయ‌మే ఇప్పుడు కూడా అక్క‌డి వైసీపీ నాయ‌కులు చేస్తున్నారు. ఇక‌, ఈ మాత్రానికి కొత్త‌గా జిల్లాలు ఏర్పాటు చేయ‌డం, కార్యాల‌యాలు నిర్మించ‌డం, అధికారుల‌ను నియ‌మించ‌డం ఎందుకు అనేది ప్ర‌శ్న‌.

నిజానికి కొత్త జిల్లా ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌గా ప్ర‌భుత్వ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ప్ర‌జ‌ల‌కు జిల్లా కేంద్రాలు ఒక‌టి రెండు చోట్ల త‌ప్పితే.. మిగిలిన జిల్లాల్లో అందుబాటులోకి వ‌చ్చాయి. సో.. దీనిని వైసీపీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ప్ర‌చారం చేయాలి.

ప్ర‌జ‌ల్లో స్థానిక‌త‌ను రాజ‌కీయంగా వినియోగించుకునే వ్యూహాలు కూడా చేయాలి. అయితే, నాయ‌కులు మాత్రం ఈ త‌ర‌హా వ్యూహాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌లు పెట్ట‌లేదు. స్థానికంగా మీకు జిల్లా ఏర్పాటు చేశాం.. కాబ‌ట్టి మీకు ప‌రిపాల‌న‌, సౌక‌ర్యాలు మ‌రింత మెరుగు ప‌డ్డాయి..అ నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలో నాయ‌కులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ఇప్ప‌టికైనా మేల్కొంటారో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.