Begin typing your search above and press return to search.
వైసీపీలో రోజా వాయిస్ మెసేజ్ కలకలం
By: Tupaki Desk | 31 Jan 2020 10:37 AM GMTవారిద్దరూ ఒకే ఒరలో కత్తులు.. చిత్తూరు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి - అదే జిల్లాకు చెందిన నగరి ఎమ్మెల్యే రోజాకు ఒకరంటే ఒకరికి పడదని బయట పెద్ద టాక్. రోజాకు మంత్రి పదవి దక్కకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నాడని రోజా సన్నిహితుల వద్ద వాపోయిందన్నది ప్రచారంలో ఉంది.
జగన్ తోపాటు ప్రతిపక్షంలో ఉండగా రోజా చాలా పోరాడారు. చంద్రబాబును ఎదురించి అసెంబ్లీ నుంచి బహిష్కరింపబడ్డారు. ఎన్నో అవమానాలు భరించారు. జగన్ సీఎం అయితే రోజా హోంమంత్రి అవుతారని అంతా భావించారు. పెద్ద ఎత్తున ప్రచారమూ జరిగింది. కానీ ఆ పెద్దాయనే రోజాకు మంత్రి పదవి దక్కకుండా చేశారన్న ప్రచారం సాగింది.
అయితే అప్పట్లో మంత్రి పదవి రాకపోయేసరికి అలిగి వెళ్లిపోయిన రోజాకు జగన్ పిలిచి మరీ ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు రోజా కాస్త ప్రశాంతంగా పార్టీలో కొనసాగుతున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా - మంత్రి పెద్దిరెడ్డి మధ్య గ్యాప్ పూర్తి కాలేదని మరోసారి బయటపడింది. తాజాగా రోజా వాయిస్ మెసేజ్ కలకలం రేపుతోంది. రోజాతో విభేదించిన సీనియర్ నేత కేజే కుమార్ షష్టి పూర్తి వేడుకలకు వెళ్లొద్దని రోజా అల్టీమేటం జారీ చేసిన ఆడియో సంచలనంగా మారింది. తనను కాదని పార్టీకి వెళితే దూరమవుతారని రోజా ఆ వాయిస్ మెసేజ్ లో హెచ్చరించారు.
ఇదే కేజే కుమార్ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి - డిప్యూటీ సీెం నారాయణ స్వామి, ఎమ్మెల్యే ఆదిమూలం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారు వస్తున్న పార్టీకి హాజరు కావద్దని రోజా తన నియోజకవర్గ నాయకులకు అల్టీమేటం జారి చేసిన ఆడియో ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది. మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజాకు పడట్లేదని అర్థమవుతోంది.