Begin typing your search above and press return to search.

తిరుప‌తిలో వైసీపీ సేఫ్ గేమ్ ఇదే ?

By:  Tupaki Desk   |   27 March 2021 2:30 PM GMT
తిరుప‌తిలో వైసీపీ సేఫ్ గేమ్ ఇదే ?
X
ఏపీలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక మీద అందరి దృష్టి ఉంది ఈ ఎన్నికల్లో గెలుపు విషయంలో ఎవరికీ అనుమానాలు లేకపోయినా... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాలు తమకు ఎక్కడ తేడా కొడ‌తాయో ? అన్న సందేహం మాత్రం అధికార వైసీపీ నేతల్లో ఉంది. తెలుగుదేశం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో 22 మంది పిల్లులు అయిన‌ ఎంపీలను గెలిపించినా ఉపయోగం లేదు... ఒక్క పులిని తిరుపతిలో గెలిపించండి అన్న ప్రచారం చేస్తోంది. గ‌తంలో న‌రేంద్ర‌మోడీ ఇదే తిరుప‌తిలో ఏపీలో టీడీపీ + బీజేపీ కూట‌మిని గెలిపిస్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని తిరుమ‌ల వెంక‌న్న సాక్షిగా హామీ ఇచ్చారు. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌భుత్వం ఈ హామీని పూర్తిగా తుంగ‌లో తొక్కేసింది.

వైసీపీ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ ఘోర వైఫ‌ల్యాన్ని ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని మ‌రీ ప్ర‌చారం చేసింది. చివ‌ర‌కు తిరుప‌తిలోనూ వైసీపీ ఈ సెంటిమెంట్‌ను బాగా వాడుకుంది. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తు చేసి ఏకంగా 2.28 ల‌క్ష‌ల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. జ‌గ‌న్ సైతం ప‌దే ప‌దే 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ప్ర‌త్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేశారు. చివ‌ర‌కు 22 మంది ఎంపీల‌ను గెలిపించిన ఏపీ ప్ర‌జ‌లు మ‌రో మూడు స్థానాల్లో స్వ‌ల్ప తేడాతో ఓడినా వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓట్లేశారు. క‌ట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు.

వైసీపీ ఎంపీలు లోక్‌స‌భ + రాజ్య‌స‌భ‌తో క‌లిపి 30 మంది వ‌ర‌కు ఉన్నా ఎవ్వ‌రూ కూడా పార్ల‌మెంటులో ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడే సాహ‌స‌మే చేయ‌డం లేదు. ఏ తిరుప‌తిలో మోదీ ప్ర‌త్యేక హోదా గురించి హామీ ఇచ్చారో... అక్క‌డే అదే సెంటిమెంట్ ర‌గిల్చి గెలిచిన వైసీపీని ఇప్పుడు టీడీపీ హోదా గురించి లేవ‌నెత్తుతూ డిఫెన్స్‌లో ప‌డేస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతోన్న దాడుల‌ను బీజేపీ ప్ర‌చారంలోకి తెస్తోంది. బీజేపీ హిందూత్వ ఎజెండాతో వైసీపీని ఇరుకున పెట్టాల‌ని చూస్తోంది.

అయితే ఈ సెంటిమెంట్‌ను త‌ట్టుకుని తిరుప‌తిలో విజ‌యం సాధించేందుకు ఇప్పుడు సంక్షేమం అన్న సేఫ్ గేమ్ నెత్తిన ఎత్తుకుంది. రామ‌తీర్థం, అంత‌ర్వేది లాంటి చోట్ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ త‌మ‌పై ఎంత వ్య‌తిరేక ప్ర‌చారం చేసినా విజ‌యం సాధించామ‌ని.. ఇప్పుడు తిరుప‌తిలోనూ త‌మ‌పై హిందూత్వ వ్య‌తిరేక సెంటిమెంట్ రెచ్చ‌గొట్టినా, ప్ర‌త్యేక హోదా తేలేదన్న విమ‌ర్శ‌లు చేసినా.. మా సంక్షేమం ముందు ఇవ‌న్నీ ఉఫ్ అని వైసీపీ అంటోంది. ఇక పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న మూడు ఎస్సీ నియోజ‌క వ‌ర్గాల్లో బ‌లంగా ఉన్న త‌మ ఓటు బ్యాంకు కూడా త‌మ‌ను తిరుగులేని మెజార్టీతో తిరుప‌తిలో గెలిపిస్తుంద‌న్న ధీమాలో వైసీపీ ఉంది.