Begin typing your search above and press return to search.

జగన్ ఔనన్నా.. వీళ్లు కాదంటున్నారట.?

By:  Tupaki Desk   |   21 Aug 2019 4:37 AM GMT
జగన్ ఔనన్నా.. వీళ్లు కాదంటున్నారట.?
X
అఖండ మెజార్టీతో ఏపీలో వైసీపీ గద్దెనెక్కింది. 151 ఎమ్మెల్యేలు గెలిచారు. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో అందరూ పదవుల పండుగ కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటికే సీనియర్లు గా ఉండి సామాజిక కోణంలో మంత్రి పదవులు దక్కని వారికి - అలిగిన వారికి జగన్ నామినేటెడ్ పదవులు ఇచ్చేశారు. ఇప్పటికే జగన్ టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి - ఎస్వీబీసీ చైర్మన్ గా ఫృథ్వీ - ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా - మహిళా కమిషన్ కు వాసిరెడ్డి పద్మా - కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజా ఇలా కీలక పదవులను భర్తీ చేశారు. ఇంకా ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ తమ సంగతేంటని చాలా మంది ఆశావహులు తాడేపల్లి జగన్ నివాసం చుట్టు చక్కర్లు కొడుతున్నారట..అయితే జగన్ అమెరికా నుంచి రాగానే పదవుల భర్తీ పూర్తి చేయాలనుకుంటున్నారట.. కానీ సీనియర్లు - పార్టీ అధిష్టానం ఆలోచన మాత్రం వేరేలా ఉందట.. ఇదే ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లుతోందట.

జగన్ పాలన 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా మండల - జిల్లా - రాష్ట్ర స్థాయి వరకు ఖాళీగా ఉన్న బోలెడు నామినేటెడ్ - కార్పొరేషన్ పదవులపై ఆశావహులు భారీ ఆశలు పెంచుకున్నారు. జగన్ నివాసం - మంత్రుల చుట్టు తిరుగుతూ లాబీయింగ్ చేస్తున్నారట.. అయితే జగన్ పదవుల భర్తీకి ఆసక్తిగా ఉన్నా వైసీపీ అధిష్టానంలోని పెద్దలు మాత్రం ఇప్పుడే వద్దంటూ ఆపుతున్నారట.. దీంతో వైసీపీ పెద్దలపై కింది స్థాయి నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.

త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కష్టపడి పార్టీని గెలిపించిన వారికే పదవులు ఇవ్వాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారట.. ముందే పదవులు ఇస్తే వారు శ్రద్ధగా పనిచేయరని.. ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తేనే అనే మెలిక పెడితే పార్టీ కోసం కష్టపడుతారని భావిస్తున్నారట..

సో జగన్ 100 రోజుల గిఫ్ట్ గా పదువుల పందేరానికి రెడీ అయినా స్థానిక సంస్థల ఎన్నికలను చూపి ఆయన ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారట.. దీంతో ఎన్నికల తర్వాత వైసీపీ నేతల పదవులు ముచ్చట తీరబోతుందన్నమాట..