Begin typing your search above and press return to search.
జగన్ కు సొంత నేతల మంచి సలహా
By: Tupaki Desk | 20 Oct 2017 4:56 AM GMTవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఆ పార్టీకి చెందిన నేతలు మంచి సలహా ఇచ్చారా? పరోక్షంగా టీడీపీకి మేలు చేసే పనులను చేస్తున్నారనే విషయాన్ని సాక్షాత్తు పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సమావేశంలోనే వెల్లడిస్తూ...అలాంటి వ్యవహారశైలిని దూరం చేసుకోవడం పార్టీకి - వ్యక్తిగతంగా జగన్ కు మేలు చేస్తుందని చెప్పారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీ చరిత్రలోనే ఇలా నేరుగా జగన్ కు ఇలాంటి సలహాలు ఇవ్వడం మొట్టమొదటి సారి అని తెలుస్తోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వివిధ వర్గాల సమాచారం ప్రకారం....తరచుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకురావడం సరైంది కాదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. పదేపదే చంద్రబాబును విమర్శించడం జగన్ ఇమేజ్ పై కూడా ప్రభావం పడేలా చేస్తోందని పార్టీ నేతలు నేరుగా జగన్ కే చెప్పినట్లు సమాచారం.
పార్టీ ఎమ్మెల్యేలు - ఎంపీలు - నేతలతో తన నివాసమైన లోటస్ పాండ్ లో జరిగిన సమావేశంలో ఈ అంశం తెరమీదకు వచ్చినట్లు సమాచారం. నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న వైఎస్ జగన్ పాదయాత్ర - ఈ సందర్భంగా ఆరు జిల్లాల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు వంటి అంశాల గురించి చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన దాదాపు 50 మంది పార్టీ నేతల్లో కొందరు...వైఎస్ జగన్ తన తీరును మార్చుకోవాలని చెప్పినట్లు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబుపై చేసిన కామెంట్లు వైసీపీ గెలుపు అవకాశాలను దెబ్బతీసినట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు. పరుషమైన కామెంట్లు చేయడం...తరచుగా సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించడం పార్టీకి చేటు చేస్తుందని సదరు నేతలు తెలిపినట్లు సమాచారం. ఇలా జగన్ ముందే ఆయన తీరును మార్చుకోవాలని చెప్పడం పార్టీ చరిత్రలోనే మొట్టమొదటి సారి అని ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఒకరు మీడియాతో పేర్కొన్నారు.
కాగా, ఈ సందర్భంగానే జగన్ పార్టీ నేతల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గడప గడపకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పేరుతో పార్టీ నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా బూత్ కమిటీలు వేయడం కొందరు నియోజకవర్గ ఇంచార్జీలు వైఫల్యం చెందారని వైసీపీ నేతల పట్ల వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 50% కమిటీలు కేవలం పేపర్ పై నమోదయ్యాయయని...ఇలా పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోని నేతల విషయంలో తాను సహించేది లేదని వైఎస్ జగన్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అలాంటి వారిని మార్చివేసి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సొంత జిల్లాలోనే ఉండి కార్యక్రమాలు చేపట్టాలని - పాదయాత్ర కోసం ఇతర జిల్లాలకు రావాల్సిన అవసరం లేదని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గవర్నర్ కు - రాష్ట్రపతి ఫిర్యాదు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.