Begin typing your search above and press return to search.
వైసీపీ సోషల్ మీడియా వీక్.. విజయసాయిరెడ్డి టీం పనిచేయడం లేదు.. కాబట్టేనా?
By: Tupaki Desk | 26 Oct 2022 8:17 AM GMTసోషల్ మీడియా.. కేవలం వ్యక్తులకు.. వ్యక్తులకు మధ్య సంబంధాలకే కాదు.. రాజకీయంగా కూడా.. ఈ మీడియా పాత్ర ఇప్పుడు ఎంతో పెరిగిపోయింది. అసలు..రాజకీయాలను,,సోషల్ మీడియాను విడిగా చూడలేని పరిస్తితి నెలకొంది. ఎందుకంటే.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నా.. ప్రజలకు తమ వాయిస్ వినిపించాలన్నా.. నాయకులకు, పార్టీలకు కూడా.. ఇప్పుడు సోషల్ మీడియా ఒక ప్రధాన వేదికగా మారిపోయింది. దీనికి ఆపార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలదీ అదే దారి.. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా.. అన్ని పార్టీలకు .. నాయకులకు కూడా.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారిపోయింది.
ఇక, తెలుగు రాష్ట్రాలకు వస్తే.. ఏపీలో సోషల్ మీడియా ప్రభావం.. నాయకుల యూసేజ్ కూడా.. ఎక్కువే. టీడీపీకి ఈ విషయంలో కొట్టిన పిండి.. అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. పార్టీ తరఫున.. అనేక కార్యక్రమాలు.. ఈ వేదికగానే జరుగుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కువగా.. సోషల్ మీడియా ను ప్రమోట్ చేశారు. దీనివల్ల.. ఎక్కువగా ప్రజలకు తమ పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు.. వాయిస్ వినిపించేందుకు కూడా.. ఎక్కవ స్కోప్ ఏర్పడింది. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్.. ఇలా.. అన్ని రకాల మాధ్యమాలను టీడీపీ ఎక్కువగా వినియోగించుకుంటోంది. దీనికి సంబంధించి ఐ-టీడీపీ ఏర్పాటు చేసి.. పెద్ద ఎత్తున దూసుకుపోతోంది.
మరి అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే.. ఏం జరుగుతోంది? అంటే. 2019 ఎన్నికల సమయంలో ఈ పార్టీ కూడా.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. పాదయాత్ర ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంది. అంతేకాదు.. పార్టీ వాయిస్‌ను, నాయకులకు కూడా.. సోషల్ మీడియా చేరువ అయింది. ముఖ్యంగా పార్టీ కీలక నాయకుడు.. ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ సోషల్ మీడియాను ముందుండి నడిపించారనడంలో సందేహం లేదు. నిత్యం మానిటరింగ్ చేస్తూ.. ఎక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా.. పార్టీకి అనుకూలంగా చక్రం తిప్పుతూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. ఇది పార్టీకి బాగా ప్లస్ అయింది.
అయితే.. పార్టీ అధికారంలోకి వచ్చినతొలి రెండేళ్లు కూడా.. ఆయనే ఈ వ్యవహారాలు చూశారు. అప్పుడు కూడా.. బాగానే పుంజుకుంది. అయితే.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు సంబందించి ఇంచార్జ్‌ను మార్చేశారు. విజయసాయిపై నమ్మకం లేక కాదు.. ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించాలని భావించిన ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత .. జగన్.. ఈ మార్పులు చేశారు. దీంతో సోషల్ మీడియా పూర్తిగా దెబ్బతిందనే భావన వ్యక్తమవుతోంది. విజయాసాయి రెడ్డి బాధ్యతలను సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే.. ఒక కీలక నేత కుమారుడికి అప్పగించినట్టు తెలిసింది. ఆయన దీనిపై ఇంకా పట్టు సంపాయించుకోలేదు.
మరోవైపు.. సాయిరెడ్డి కూడా.. తనకు వద్దన్న బాధ్యతల జోలికి ఎందుకు వెళ్లాలని అనుకున్నారో.. లేక.. ఏం జరుగుతుందో చూడాలని అనుకున్నారో.. ఆయన కూడా. . మౌనంగా నే ఉన్నారు. దీంతో సోషల్ మీడియా లో ఇప్పుడు ..వైసీపీ పూర్తిగా బలహీనంగా మారిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. అయితే.. మరికొద్ది నెల్లలోనే ఎన్నికలు ఉండడం.. ప్రధాన ప్రతిపక్షం ఐటీడీపీ ద్వారా దూసుకుపోతుండడం చూస్తే.. వైసీపీకి ఈ లోటు.. ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం మెండుగానే ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.