Begin typing your search above and press return to search.

ఒక్కొక్క ఎమ్మెల్యేకు.. 30 కోట్లా? వైసీపీ వ్యూహం ఇదేనా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 2:30 AM GMT
ఒక్కొక్క ఎమ్మెల్యేకు.. 30 కోట్లా? వైసీపీ వ్యూహం ఇదేనా?
X
వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోందా? 2024 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థి తిలోనూ విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని.. వైసీపీనిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని.. ప‌దే ప‌దే.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

అయితే.. ఈ వ్యూహాన్ని సాధించేందుకు వైసీపీ అధిష్టానం.. చాలా ప‌క్కాగా ముందుకు సాగుతోందా? ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు సంక్షేమం పేరుతో నిధుల‌ను నేరుగా అందిస్తున్న వైసీపీ.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ నిధులు పారించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఒక్కొక్క ఎమ్మెల్యేకు సుమారు 30 కోట్ల రూపాయ‌ల చొప్పున ఇచ్చేందుకు పార్టీ ప్లాన్ చేస్తున్న గుస‌గుస వినిపి స్తోంది. మీరైనా సంపాయించుకోండి..అని పార్టీ నేత‌ల‌కు చెబుతోంద‌ని.. బీజేపీ నేత‌లు వ్యాఖ్యాని స్తున్నారు. తాజాగా.. ఇదే విష‌యంపై .. బీజేపీ మాజీ ఎమ్మెల్యే.. విష్ణు కుమార్‌ రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల చొప్పున ఇచ్చి గెలిపించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు. దీనిని బ‌ట్టి.. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. ధ‌న ప్ర‌వాహం ఆగ‌బోద‌ని.. ఆయ‌న విమ‌ర్శించారు. గెలుపు గుర్రం ఎక్క‌డమే ల‌క్ష్యంగా స‌ర్కారుపాల‌న ఉంద‌న్నారు.

ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా.. తెలుసుకోవాల‌ని..విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఏపీలో ఓట్ల రాజ‌కీయం కూడా తెర‌మీదికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ఓట్ల‌లో.. త‌మ‌కు అనుకూలంగా లేనివారి ఓట్ల‌ను తొల‌గించేందుకు అధికార పార్టీ పెద్ద‌లు కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదే... విష‌యాన్ని బీజేపీ ఎంపీ.. జీవీఎల్ న‌ర‌సింహారావు తేల్చిచెప్పారు.

పెద్ద సంఖ్యలో ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింద‌ని ఆయ‌న చెప్పారు. ఆంధ్రేతర ప్రాంతా నికి చెందిన ఓటర్లను కావాలని జాబితాలోంచి తొలగించారని, ఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖరాశామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఒక్క విశాఖ‌ప‌ట్నంలోనే సుమారు 50 వేలకు తక్కువ కాకుండా ఓట్లు గల్లంతు చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇత‌ర న‌గ‌రాల్లో ప‌రిస్థితి ఏంటో త్వ‌ర‌లోనేతేలుస్తామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం