Begin typing your search above and press return to search.
ఇలా చేస్తే.. టీడీపీ ప్రజలకు దూరమవుతుందనేనా? వైసీపీ వ్యూహం ఏంటి?
By: Tupaki Desk | 21 Sep 2022 11:30 PM GMTటీడీపీని ప్రజలకు దూరం చేయాలి.. చంద్రబాబును ఒక నిస్తేజపూరిత నాయకుడిగా జనం మధ్య నిలబెట్టా లి.. ఇదీ.. వైసీపీ వ్యూహం అని.. మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో బలమైన పార్టీ ఏదైనా ఉంటే.. బూత్ స్థాయిలో కార్యకర్తలు, నేతలు.. పునాదులు వేసుకున్న పార్టీ ఏదైనా ఉంటే.. అది నిస్సందేహంగా టీడీపీనే! అయితే.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలిచితీరాలని భావిస్తున్న వైసీపీ వ్యూహాత్మకంగా టీడీపీని ఇరుకున పెట్టే చర్యలకే ప్రాధాన్యం ఇస్తోందని.. మేదావులు చెబుతున్నారు.
రోజుకోవిన్యాసం.. రోజుకో వింత వైఖరితో టీడీపీని ప్రజలకు దూరం చేయాలనేవ్యూహంతో వైసీపీ నాయకు లు.. అధిష్టానం కూడా.. దూకుడుగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ఇప్పటికే.. టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారు. ఏకంగా.. చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారు. పార్టీ నేతలపై కేసులు పెట్టి జైళ్లకు తరలించారు. ఇన్ని జరిగినా.. పార్టీ నిలదొక్కకుని ముందుకు సాగుతోంది. ఇదే వైసీపీకి కళ్లలో కారు కొట్టినట్టు గా వుందనేది మేధావులు చెబుతున్న మాట.
ఈ క్రమంలో టీడీపీని బలంగా ఎదుర్కొనాలంటే.. పార్టీ అధినేత చంద్రబాబును నిత్యం డిఫెన్స్‌లో పడేయా లంటే.. ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోందని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే.. తాజాగా ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును వైఎస్ ఆర్ విశ్వవిద్యాలయంగా మార్పునకు నిర్ణయించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది .. కేవలం టీడీపీని దెబ్బకొట్టేందుకు.. ఆ పార్టీని ప్రజలకు దూరం చేసేందుకు మాత్రమే వైసీపీ వేసిన పాచికగా చెబుతున్నారు.
ఎలా?
టీడీపీని ప్రజలకు దూరం చేయడానికి ఇప్పుడు వేసిన మంత్రం ఎలా ఉపయోగపడుతుందనేది.. చర్చకు వస్తున్న అంశం. ఇప్పటికే ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు పెట్టారు. దీనిని తాము మాత్రమే సాధించిన ఘనతగా చెప్పుకొచ్చారు. నిజంగానే ఈ విషయంలో టీడీపీపై చర్చ జరిగింది. 14 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ.. ఎందుకు ఇలా ఆలోచన చేయలేక పోయిందనే చర్చ వచ్చింది.
ఇక, ఇప్పుడు కీలకమైన వర్సిటీ పేరును మార్చడం. దీనిని టీడీపీ ఎలానూ అడ్డుకోలేదు. ఎందుకంటే.. సభలో బలం లేదు. పోనీ.. న్యాయపరంగా దూకుడు గా ముందుకు సాగాలన్నా.. ఇది విధానపరమైన నిర్ణయం. దీనిలో జోక్యం చేసుకునేందుకు కోర్టు లు కూడా అంగీకరించవు. దీనికి నంద్యాల జిల్లా పేరు మార్పుపై ఇచ్చిన తీర్పే ఉదాహరణ. అంటే.. ఎన్టీఆర్ పేరును అడ్డగోలుగా వైసీపీ ప్రభుత్వం మార్చేసినా.. టీడీపీ.. ఏమీ చేయలేక పోయిందనే సంకేతాలను ప్రజల్లోకి పంపించడం.. వైసీపీకి అత్యంత తేలిక. తద్వారా.. ''టీడీపీ పని అయిపోయింది!''అనే చర్చ ను ప్రజల్లోకి బలంగా చర్చకు పెట్టనుంది.
ఇలా చేయడంతోపాటు.. చంద్రబాబు వ్యూహాలు లేకుండా.. ముందుకు సాగుతున్నారనే వాదనను కూడా ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఏతావాతా ఎలా చూసుకున్నా.. ప్రజలకు టీడీపీని దూరం చేయడం.. చంద్రబాబు వ్యూహం లేని నాయకుడనే ముద్ర వేయడం ద్వారా.. వైసీపీ రాజకీయం దూకుడు పెంచాలనే కుతంత్రం ఉందని అంటున్నారు మేధావులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.