Begin typing your search above and press return to search.
బాబు వ్యతిరేక ఓటు ఫ్యాన్ కే..?
By: Tupaki Desk | 11 April 2019 5:23 AM GMTఏపీలో పోరు త్రిముఖం అని అనుకున్నా.. ఆఖరిలో జనసేన పార్టీ తన పట్టును పూర్తిగా విడిచేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్షేత్ర స్థాయికి వెళ్లి, పోలింగ్ పరిస్థితులను గమనిస్తున్నా.. జనసేన ఊసు పెద్దగా వినిపించకపోవడం విశేషం. ఆ సంగతలా ఉంటే.. కాస్తోకూస్తో బలంగా ఉన్న జనసేన నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొనేశారనే ప్రచారం జరుగుతూ ఉంది!
నాలుగైదు వేల ఓట్లను వెంట పెట్టుకున్నారనే వారికి ఒక ధర పెట్టారని, ఆ ధర మేరకు వాళ్లందరూ తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేయాలంటూ కొనేశారని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ మేరకు చాలా మంది నేతలకు ఫోన్లు వెళ్లాయని సమాచారం.
ఇక ప్రచార పర్వం నుంచినే తన పార్టీ గ్రాఫ్ ను పవన్ కల్యాణ్ తగ్గించుకొంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ మీద పల్లెత్తు మాట అనకపోవడం.. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం.. పదే పదే జగన్ పై అసంబద్ధమైన విమర్శలు కూడా చేయడం ద్వారా పవన్ కల్యాణ్ తన అజెండా ఏమిటో సూటిగా చెప్పేశారు.
చంద్రబాబును గద్దె దించాలని అనుకున్న ఓటరు పవన్ కల్యాణ్ ను కూడా ముందుగా పరిగణనలోకి తీసుకున్నా.. పవన్ ప్రచార తీరు.. అందుకు విరుద్ధంగా అనిపించింది. ఈ నేపథ్యంలో..ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం..తెలుగుదేశంపార్టీ వ్యతిరేక ఓటుఫ్యాన్ వైపే మొగ్గు చూపుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయం పక్షం రోజుల నుంచినే స్పష్టం అవుతూ వస్తోందని అంటున్నారు.
'ఇండియన్ ఎక్స్ ప్రెస్' లో ఈ మేరకు నిన్న అచ్చు అయిన ఒక వ్యాసం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. గోదావరి జిల్లాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని, తీవ్రంగా ఉన్న తెలుగుదేశం వ్యతిరేకత అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజేతగా నిలిపే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు.