Begin typing your search above and press return to search.
అసెంబ్లీ లో టీడీపీని బుక్ చేయబోతున్న వైసీపీ
By: Tupaki Desk | 13 Dec 2019 5:41 AM GMTఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా మొదలయ్యాయి. ఏపీ అసెంబ్లో శుక్రవారం సభ ప్రారంభం కాగానే మార్షల్స్ పట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబు దారుణంగా ప్రవర్తించాడు. బాస్టర్డ్ అంటూ తిట్టేశాడు. ఇది దుమారం రేపింది. చంద్రబాబు తీరును అసెంబ్లీలో వీడియోలు చూపించి మరీ జగన్ ఎండగట్టారు.
ఇక ఐదరోజు పలు అంశాలను సభలో చర్చించాలని అధికార, ప్రతిపక్షాలు తీర్మానించాయి.. ఎన్నికల తర్వాత చాలా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం,అన్ని ప్రభుత్వ శాఖల్లో బిల్లులు పెండింగ్ పై టీడీపీ ప్రశ్నలు సంధించడానికి రెడీ అయ్యింది.
ఇక అధికార వైసీపీ ఈరోజు టీడీపీ ని ఇరుకున పెట్టే అంశాలను చర్చలోకి తీసుకొస్తోంది. టీడీపీ హయాంలో కలకలం రేపిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ పై విచారణ, రివర్స్ టెండెరింగ్ ద్వారా నిధుల మిగులు, రాజధానిలోని కొండవీటి వాగు లిఫ్ట్ ఇర్రిగేషన్ లో అక్రమాలపై వైసీపీ ప్రశ్నలు లేవనెత్తబోతోంది.
ఇక జగన్ సర్కారు తెస్తున్న పారదర్శక పాలన, అవినీతి నిర్మూలన జ్యుడీషియల్ ప్రివ్యూను చర్చించబోతున్నారు. ఇదే కాకుండా పోలవరం సహా ప్రాజెక్టులపై వైసీపీ సర్కారు తెస్తున్న రివర్స్ టెండరింగ్ పై స్వల్పకాలిక చర్చ జరుపున్నారు.
ఇక శాసన మండలిలో రాష్ట్ర రాజదాని మార్పు,సన్న బియ్యం సరఫరా పై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తడానికి రెడీ అయ్యారు. దీంతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు, అమరావతి నిర్మాణంపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుపనున్నారు.