Begin typing your search above and press return to search.
డీఎంకే వర్సెస్ వైసీపీ
By: Tupaki Desk | 8 Dec 2015 7:21 AM GMTచెన్నై వరదలు ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టాయి.. అదే సమయంలో ఎందరికో పాఠాలు నేర్పాయి. అక్కడి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాయి. అదేసమయంలో చెన్నై వర్షాల సమయంలో తమిళనాడులో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు నుంచి ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా పాఠం నేర్చుకోవాలని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పదిహేను ఇరవై రోజులుగా చెన్నై ప్రజలను వర్షాలు నానా కష్టాలకు గురిచేయగా ప్రభుత్వం కూడా చేష్టలుడిగి చూడాల్సి వచ్చింది. అందులో ప్రభుత్వం చేతకానితనం కూడా చాలావరకు ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. కోట్లాది మంది ప్రజలు నరకం అనుభవిస్తున్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపై రాజకీయ విమర్శలు చేసి జయలలితపై రాళ్లేయడం కంటే ప్రజలను వీలైనంత వరకు ఆదుకోవడమే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఆదర్శంగా నిలిచింది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నా డీఎంకే - డీఎంకేల మధ్య ఉన్న వైరం తీవ్రత దేశంలో ఇంకే రాష్ట్రంలోని పార్టీల మధ్యా కనిపించదు. ఒకరినొకరు అవమానకర రీతిలో అరెస్టులు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అలాంటి పార్టీలు కూడా వర్షాల సమయంలో సంయమనంతో ఉన్నాయి. మామూలుగా అయితే చిన్న విషయానికైనా ప్రభుత్వంపై విరుచుకుపడే డీఎంకే వర్షాల సమయంలో ఏమాత్రం నోరుజారలేదు. డీఎంకే శ్రేణులు వరదల విషయంలో అధికార పార్టీని విమర్శించలేదు. తొలుత ప్రజలకు సాయం చేయాలని... ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని డీఎంకే ముఖ్యనేతలు కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో చెన్నై వరదల్లో రాజకీయాల ఊసే కనిపించడం లేదు.
కానీ, ఏపీలో విపక్ష వైసీపీ నేత జగన్ వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ నెల్లూరు, రాయలసీమల్లో వరదలు తగ్గుముఖం పట్టకుండానే ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. హుద్ హుద్ తుపాను సమయంలోనూ ఆయన అదే ధోరణి అనుసరించారు. అమరావతి శంకుస్థాపన అప్పుడూ విచిత్రంగా వ్యవహరించారు. అందుకే డీఎంకేను చూసి ఆయన చాలా నేర్చుకోవాలని టీడీపీ అంటోంది.