Begin typing your search above and press return to search.
ఆ రెండింటిపైనా కోర్టుకు వెళ్లనున్న జగన్ పార్టీ!
By: Tupaki Desk | 28 May 2019 5:03 AM GMTఇటీవల వెలువడిన వెలువడిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలుగుదేశం ఖాతాలో పడిన గుంటూరు.. శ్రీకాకుళం ఎంపీ స్థానాలు రెండింటిలోనూ తామే గెలిచామన్న భావనను ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఓట్ల లెక్కింపు విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్.. ఈ విషయంపై న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రెఢీ అవుతోంది. గుంటూరు.. శ్రీకాకుళం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. దువ్వాడ శ్రీనివాస్ లు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరితో పాటు పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి.. సజ్జల రామకృష్ణారెడ్డిలు కూడా ఉన్నారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో రిటర్నింగ్ అధికారులు సరిగా వ్యవహరించలేదని.. సర్వీసు ఓట్లలో ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వచ్చాయని జగన్ దృష్టికి అభ్యర్థులు తీసుకెళ్లారు. గుంటూరులో టీడీపీ అభ్యర్థి సుమారు 4 వేల మెజార్టీతో విజయం సాధించినట్లుగా ప్రకటించారు. అయితే.. సర్వీసు ఓట్లను సరిగా లెక్కిస్తే.. తాము గెలుస్తామని.. దాదాపుగా 9 వేల ఓట్ల వరకూ వచ్చాయని.. వాటి విషయంలో తాము చేసిన వినతుల్ని ఎన్నికల అధికారులు అంగీకరించలేదన్నారు.
పోస్టల్ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నా వాటిని పరిగణలోకి తీసుకోలేదని మోదుగుల ఆరోపించారు. దాదాపుగా ఇదే తరహా ఆరోపణను చేశారు శ్రీకాకుళం అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్. తాను పోటీ చేసిన స్థానంలో రామ్మోహన్ నాయుడు ఆరు వేల ఓట్లు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారని.. అధికారులు తమకు పడిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటే గెలుపు తమదేనని స్పష్టం చేశారు. వీరి వాదనల నేపథ్యంలో.. ఈ స్థానాల్లోని ఓట్ల లెక్కింపుపై కోర్టుకు వెళ్లేందుకు జగన్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ వాదనల్ని కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో తేలాలంటే కొద్ది సమయం పడుతుందని చెప్పక తప్పదు.