Begin typing your search above and press return to search.
కేంద్ర కేబినెట్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీస్
By: Tupaki Desk | 15 March 2018 9:44 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కేంద్ర కేబినెట్ పై అవిశ్వాస తీర్మానం దిశగా అడుగు వేసింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్ కు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసు ఇచ్చారు. రేపు లోక్ సభ కార్యకలాపాల్లో దీనిని కూడా చేర్చాలని కోరారు. ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముందుగా భావించామని - అయితే పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉండటంతో అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకాలని కోరుతూ అన్ని పార్టీలకు వైఎస్ జగన్ లేఖలు రాశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని నేపథ్యంలో - తాము పెడుతున్న అవిశ్వాస తీర్మానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని వైఎస్ జగన్ లేఖలో కోరారని చెప్పారు. సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన రోజు ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో ఆ పార్టీ ఆందోళన కొనసాగుతోంది. ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ తొలి అంతస్తులో నిలబడి ప్రత్యేక హోదా ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని అరుణ్ జైట్లీ ఇప్పటికే స్పష్టంచేశారు. దీంతో టీడీపీ తమ ఇద్దరు కేంద్ర మంత్రులను కేబినెట్ నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెడదామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో టీడీపీకి సవాలు విసురుతున్నారు. ఏపీలోని ఎంపీలందరూ రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కాగా, ప్రత్యేక హోదా సాధనకు తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి 100 మంది ఎంపీల మద్దతు ఉందని వైఎస్ ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. హోదా సాధనకు ఈ నెల 16న కేంద్రంపై వైయస్ ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు కాంగ్రెస్ - వామపక్షాలు - ఇతర పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయన్నారు. టీడీపీ ఎంపీలు కూడా తమతో కలిసి పోరాటం చేయాలని ఆయన సూచించారు.