Begin typing your search above and press return to search.
అనంత టీడీపీ నేతకు వైసీపీ బంపర్ ఆఫర్
By: Tupaki Desk | 23 May 2016 6:44 AM GMTటీడీపీ ఆకర్ష మంత్రంతో తమ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో నీరసించిపోయిన వైసీపీ మళ్లీ రాజకీయ చక్రం తిప్పడం మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సూత్రం ప్రకారం అక్కడే అవకాశాలు సృష్టించుకోవాలని ప్రయత్నిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిన నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉన్న కీలక టీడీపీ నేతలను తమ పార్టీలోకి తేవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఒకరిద్దరి నుంచి సానుకూలత కనిపించినట్లు తెలుస్తోంది.
వైసీపీ టికెట్లపై విజయం సాధించిన 17 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు. మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారన్న వార్తలూ వినవస్తున్నాయి. కొత్తగా ఎమ్మెల్యేల చేరికలతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలో భూమా- శిల్పా - ప్రకాశం జిల్లాలో కరణం- గొట్టిపాటి - పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తపల్లి- మాధవనాయుడు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. తాజాగా అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఉందట. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా... ఇటీవలే వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరారు. దీంతో అప్పటిదాకా నియోజకవర్గ ఇన్ చార్జీగా ఉన్న కందికుంట వెంకటప్రసాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చాంద్ బాషాను పార్టీలో చేర్చుకునే సమయంలోనే కందికుంట తన వ్యతిరేకతను పార్టీ పెద్దలకు తెలియజేశారు. పరిటాల రవీంద్ర వర్గానికి చెందిన కందికుంటకు చెక్ పెట్టేందుకే ఓ వర్గం నేతలు చాంద్ బాషాను బలవంతంగానే పార్టీలోకి తీసుకొచ్చినట్లు సమాచారం. చాంద్ భాషా చేరికతో కందికుంటలో ఆగ్రహం ఇంకా చల్లారలేదని టాక్.
కదిరి టీడీపీలోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న వైసీపీ వర్గాలు కందికుంటకు ఎరవేస్తున్నట్లుగా తెలుస్తోంది. కందికుంట అసంతృప్తిగా ఉన్న విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కదిరి టీడీపీ టికెట్ చాంద్ బాషాకే దక్కుతుందని చెబుతున్న వైసీపీ నేతలు... కందికుంట తమ పార్టీలో చేరితే ఏకంగా హిందూపురం పార్లమెంట్ టికెట్ ఇస్తామంటున్నారట. చేనేత సామాజిక వర్గానికి చెందిన కందికుంటకు హిందూపురం పరిధిలో మంచి బలమే ఉండడంతో ఆయన వైసీపీ ఆఫర్ కు ఆకర్షితమైనట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే టీడీపీకి అనంతపురంలో గట్టి దెబ్బ తగిలినట్లే.