Begin typing your search above and press return to search.
వైసీపీకి హ్యాకర్ల షాక్!
By: Tupaki Desk | 10 Dec 2022 7:31 AM GMTఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. హ్యాకర్లు ఆ పార్టీకి షాకిచ్చారు. వైసీపీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. వైసీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ లను మార్చేశారు. డిసెంబర్ 9 అర్ధరాత్రి ఇది జరిగిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు వైసీపీ ట్విటర్ పేజీలో క్రిప్టో పోస్టులు చేశారు. దీనిపై వైసీపీ టెక్నికల్ టీమ్ ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తమ ఖాతాను తిరిగి యధావిధిగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
కాగా వైసీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు పలు ట్వీట్లను రీట్వీట్లు సైతం చేశారు. కాగా వైసీపీ ట్విట్టర్ ఖాతాను 8,24,700 మంది ఫాలో అవుతున్నారు. అలాగే వైసీపీ ట్విట్టర్ ఖాతా ఇద్దరిని అనుసరిస్తోంది. వీరిలో ఒకరు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాగా మరొకటి సీఎంవో ఆంధ్రప్రదేశ్. ఈ రెండు ఖాతాలనే వైసీపీ ఫాలో అవుతోంది.
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ సైబర్ నేరాలు అంతే స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దుండగులు పెద్ద పెద్ద సంస్థలు, సెలబ్రిటీలు, సినీ నటులు తదితరులకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. వాటిలో సంబంధం లేని పోస్టులను పెడుతూ ఆ ఖాతాలను అనుసరిస్తున్నవారిని దుండగులు తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఆయా వ్యక్తులు, సంస్థలు, సెలబ్రిటీలు, పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్టులు కనిపిస్తుండటంతో వాటిని వారే చేశారని వారిని అనుసరిస్తున్నవారు భావిస్తున్నారు. హ్యాకింగ్ కు గురయిన ఖాతాలను తిరిగి పునరుద్ధరింప చేసుకోవడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. కొన్నిసార్లు వాటిని తిరిగి యధాతథ స్థితికి తీసుకురాలేకపోతే ఆ ఖాతాలను ఇక వదిలేయాల్సి వస్తోంది.
తాజాగా వైసీపీ ట్విట్టర్ ఖాతా ఇలాగే హ్యాకింగ్ కు గురయింది. గతంలో టీడీపీ, జనసేన ఖాతాల పేరుతోనూ దుండగులు తప్పుడు పోస్టులు పెట్టడం, వాటిని ఆ పార్టీలే పెట్టాయన్నట్టు నమ్మించడం చేశారు. తర్వాత ఆయా పార్టీలు ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఆ పోస్టులు తాము చేసినవి కాదని ప్రకటించాల్సి వచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.