Begin typing your search above and press return to search.
మీడియా దుష్ప్రచారం..వైసీపీ అమెరికా విభాగం ఖండన
By: Tupaki Desk | 8 May 2017 9:57 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు సంబంధించిన నెలకొన్న కలకలంలో ఓ వర్గం మీడియా అత్యుత్సాహంపై వైఎస్‌ఆర్ సీపీ అమెరికా విభాగం తీవ్రంగా మండిపడింది. అమెరికాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా డల్లాస్‌లో తాము ఆందోళనలు చేపట్టినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేయడంతో పాటు పలు వెబ్‌సైట్లలోని కథనాలను పార్టీ యూఎస్ విభాగం తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ వైఎస్ ఆర్‌సీపీ అమెరికా విభాగం కన్వీనర్లు రత్నాకర్ పండుగాయల - గురవారెడ్డి తేల్చిచెప్పారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు తాము ఎలాంటి ఫిర్యాదులు కానీ, ఈ-మెయిల్స్ కూడా చేయలేదని రత్నాకర్ స్పష్టం చేశారు.
చంద్రబాబు అమెరికా పర్యటన నేపథ్యంలో వైఎస్ ఆర్ సీపీ అమెరికా విభాగం తరపున నిరసన కార్యక్రమం చేపట్టినట్లు కొన్ని మీడియా చానల్లు ప్రసారం చేశాయి. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు వార్తలు రాశాయి. వైసీపీ పాత్రను జోడించి దుష్ప్రచారాన్ని రత్నాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికాలో చంద్రబాబు పర్యటన విజయవంతం కాలేదన్న అక్కసుతోనే కావాలని వైఎస్‌ఆర్‌సీపీపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ఈ ప్రచారంలో నిజం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న విబేధాలను బయటపడకుండా ఉండేందుకే ఈ రకమైన ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారని రత్నాకర్ మండిపడ్డారు. పార్టీ చందాలు, నిధుల సేకరణ విషయంలో స్థానికంగా ఇక్కడ టీడీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన విబేధాలు బయటకు రాకుండా ఉండేందుకు వైఎస్ ఆర్ సీపీపై బురదచల్లేలా కొన్ని ప్రసార మాధ్యమాలు వ్యవహరించాయని తెలిపారు. టీడీపీ అనుకూల మీడియా వచ్చిన కథనాలను చూసి తాము ఆశ్చర్యపోయినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి నిరాధార వార్తలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఒకవేళ ఇందులో నిజాలు ఉంటే నిరూపించాలని రత్నాకర్ చాలెంజ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/